ఆఖరి సమావేశాలు : నేటి నుండి ఓట్ ఆన్ అకౌంట్ సెషన్స్ : కీలక నిర్ణయాల దిశగా..!
ఏపి శాసనసభ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధిం చి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో..ఏపి అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ప్రారంభం అవుతు న్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ కు ఆమోదం తెలప టం తో పాటుగా పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.

నేటి నుండే సమావేశాలు..
ప్రస్తుత టర్న్ ముగుస్తున్న వేళ..ఏపి శాసనసభా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఏపి క్యాబినెట్ సమావేశం జరగనుంది. అందులో గవర్నర్ ప్రసంగానికి ఆమోద ముద్ర వేయనున్నారు. 9.30 గంటలకు గవర్నర్ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ వెంటనే సభ ప్రారంభం అవుతుంది. గవర్నర్ ఉభయ సభ లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంగంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ అయిదేళ్ల కాలం లో సాధించిన ప్రగతి..కొత్త ఆలోచనలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ తరువాత సభ 31 వ తేదీకి వాయిదా పడుతుంది. 31న మావోయిస్టుల చేతిలో మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోముకు సంతాప తీర్మానం ప్రవేశ పెడతారు. చర్చ తరువాత సభ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా పడు తుంది. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాకు వెళ్లి..ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పెన్షన్ల పెంపు..డ్వా క్రా మహిళలకు చెక్కుల పంపిణీ లో నియోజకవర్గాల్లో పాల్గొంటారు. తిరిగి సభ ఫిబ్రవరి 5న ప్రారంభం అవుతుంది.
5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్..
ఏపి ప్రభుత్వం ఎన్నికల ఏడాది కావటంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు పరిమితం అవుతోంది. ఫిబ్రవరి 5న సభ తిరిగి ప్రారంభం అయిన తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఉంటుంది. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. దీని పై ఫిబ్రవరి 6,7, 8 తేదీల్లో చర్చ ఉంటుంది. 8వ తేదీ తో ప్రస్తుత సమావేశాలు ముగియటం తో పాటుగా ప్రస్తుత టర్మ్ సైతం ముగియనుంది. దీంతో..ఈ సమావేశాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చివరి సమావేశాలు. కాగా.. తమ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి నందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు చిట్టచివరి సమావేశాలకూ హాజరు కావడంలేదు. ఇక, ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావటంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాపు రిజర్వేషన్ల అంశం..చుక్కల భూములు..రైతులకు సంబంధించిన కొత్త కార్యక్రమం అసెంబ్లీ వేదికగా ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొనే నిర్ణయాలు..బడ్జెట్ పైనా ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications