ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 22 మంది మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీలో అయితే స్వల్పంగా పెరుగుతున్నాయి. నిన్నటికన్నా 64 కేసులు ఎక్కువ వచ్చాయి. గత 24 గంటల్లో 81,505 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2209 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తాజా కేసులో 19,78,350 మంది వైరస్ బారిన పడ్డారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో 22 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,490కి చేరింది. 24 గంటల్లో 1896 మంది కరోనాతో కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,593 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కృష్ణా జిల్లాలో ఆరుగురు, గుంటూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, తూర్పు గోదావరి, కడప, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ఇంకా ప్రకటించలేదు. డిసిషన్ మాత్రం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications