ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ..: నిన్నటికన్నా వెయ్యి కేసులు ఎక్కువ

కరోనా కేసులు తగ్గుతూ, పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 85,822 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,442 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 19,71,101కు చేరింది. మరో 16 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 13,444కు చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,412 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,37,473కి చేరింది. ప్రస్తుతం 20,184 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు,అనంతపూర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప , కర్నూల్‌తోపాటు విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

2442 people infected corona in andhra pradesh

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

    Spl Interview with bjp leader Enugu Ravindar Reddy on Etala Padayatra

    వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+