ఏపీలో 335 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 500 లోపే కేసులు రావడం ఊరట కలిగించే అంశంగా మారింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 335 కరోనా కేసులు వచ్చాయి. నిన్నటితో (425) పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో కరోనా సోకిన ముగ్గురు చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కరు చొప్పున చనిపోయారు.

ఒక్కరోజు వ్యవధిలో 936 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజులో రాష్ట్రంలో 19 వేల 241 కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో 3,29,77,640 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,585గా ఉంది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,94,818 ఉంది. రాష్ట్రంలో 6 వేల 754 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 335 people infected coronavirus in andhra pradesh

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14 వేల 713కి పెరిగింది. రోజు రోజుకి కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే అంశం అని నిపుణులు అంటున్నారు. దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు 20 వేల దిగువకు చేరాయి. రికవరీ గణనీయంగా పెరుగుతుండటంతో.. యాక్టివ్ కేసులు తగ్గిపోతున్నాయి. గత 24 గంటల్లో 11,87,766 కరోనా పరీక్షలు చేయగా.. 19,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2,300 కేసులు తగ్గాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.68%కి పడిపోయింది. నిన్న మరో 673 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,11,903కు చేరింది.

కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. నిన్న 48 వేల 847 మంది కోలుకున్నారు. వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.20 కోట్లు దాటింది. ఆ రేటు 98.28%కు పెరిగింది. యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆ రేటు 0.52%కి పడిపోయి.. ఆ సంఖ్య 2,24,187కు తగ్గింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశంలో నిన్న 30,81,336 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 175 కోట్లు దాటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+