ఏపీలో కరోనా తగ్గుముఖం: 10 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 30,578 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4,605 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా ధాటికి రాష్ట్రంలో మరో 10 మంది మృతి చెందారు. మరో 11,729 మంది కొవిడ్ బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 93,488 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి గత 24 గంటల్లో 10 మంది మరణించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో ఇద్దరిద్దరూ మరణించగా.. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,93,171 కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి 21,85,042 మంది కోలుకున్నారు. కొవిడ్ మహమ్మారి ధాటికి రాష్ట్రంలో 14,641 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 642 కరోనా కేసులు నమోదవ్వగా.. పశ్చిమ గోదావరి 539, గుంటూరు 524, నెల్లూరు 501, కృష్ణా 477, కడప జిల్లాలో 413 కరోనా కేసులు వెలుగు చూశాయి.

దేశంలో ఒమిక్రాన్ సాముహిక వ్యాప్తి దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇంతలోనే డ్రాగన్ మరో స్టేట్ మెంట్ ఇచ్చింది. కొత్త వైరస్ వేరియంట్ గురించి చెప్పి.. ఆందోళన కలుగజేసింది. యూరప్‌లో కూడా ఈ ఏడాది చివరి వరకు కరోనా వైరస్ అంతం అవుతుందని ప్రకటన చేసింది.
ఇటు వ్యాక్సిన్ తీసుకున్న వారి జోలికి ఒమిక్రాన్ రాబోదని.. అందుకే నిపుణులు కచ్చితంగా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. వైరస్ తగ్గుముఖం పడుతున్న.. జాగ్రత్తతో ఉండాలని కోరింది. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మాత్రం వేగంగా వ్యాప్తి చెందింది. అందరినీ ఒకసారి పలకరించింది మరీ వెళ్తుంది. అలా రాజకీయ నేతలు కూడా వైరస్ బారిన పడతున్నారు. వారంత వృద్దులే కావడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. రికవరీ రేటు కూడా ఎక్కువే ఉండటం ఊరట కలిగించే అంశంగా మారింది.












Click it and Unblock the Notifications