అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో మరో 7 ఒమిక్రాన్ కేసులు: అంతా విదేశాల నుంచి.. ఒక్కరు గోవా నుంచి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మరో 7 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 24కి చేరింది. కృష్ణా 3, తూర్పు గోదావరి 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కేసుల చొప్పున వచ్చాయి. ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి ఒక్కొక్కరు రాష్ట్రానికి వచ్చారు.

ఇటు రాష్ట్రంలో గత 24 గంటల్లో 28 వేల 311 పరీక్షలు నిర్వహించారు. 334 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు వచ్చిన కేసుల సంఖ్య 20,77,942కి చేరింది. కరోనా సోకి నెల్లూరు జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో చనిపోయిన మొత్తం సంఖ్య 14,499కి చేరింది. రోజు వ్యవధిలో 95 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,61,927 మంది కోలుకున్నారు. ఏపీలో 1516 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

7 omicron cases are register in the andhra pradesh

గత ఆరు నెలలుగా దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతూ వచ్చాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా క్రమంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.

ఒమిక్రాన్ టెన్షన్‌తో నైట్ కర్ఫ్యూ వచ్చేసింది. చాలా రాష్ట్రాలు రాత్రి పూట కర్ప్యూను ప్రకటించాయి. ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఈ నెల ఆఖరు వరకు కర్ఫ్యూ.. లేదంటే స్వల్పంగా లాక్ డౌన్ విధించే సిచుయేషన్ అయితే ఉంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. రోజు రోజుకు అయితే కేసులు మాత్రం పెరగడం కాస్తం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.

English summary
7 omicron cases are register in the andhra pradesh state health department said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X