ఏపీలో తగ్గిన కరోనా కేసులు: నిన్నటికన్నా 147 కేసులు తక్కువ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వెయ్యి లోపు కేసులు రావడం కాస్త ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో రాష్ట్రంలో 22 వేల 785 కరోనా టెస్టులు చేయగా.. 749 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన ముగ్గురు చనిపోయారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. గత 24 గంటల వ్యవధిలో 6 వేల 271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,28,31,785 కరోనా టెస్టులు చేశారు.
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,697కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,12,778గా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,79,152 కాగా.. ప్రస్తుతం 18వేల 929 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం 896 కేసులు, 6 మరణాలు పోలిస్తే ఆదివారం కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.

ఇటే దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 45 వేల దిగువకు కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం 14.50 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 44వేల 877 మందికి వైరస్ సోకింది. ముందురోజు 50,407తో పోల్చితే 11 శాతం మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గి 3.17 శాతానికి చేరింది.
కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 5.37 లక్షలకు పడిపోయాయి. యాక్టివ్ కేసుల రేటు 1.43 శాతంగా నమోదైంది. గత 24 గంటల వ్యవధిలో 1.17 లక్షలకుపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 48.81 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 172.81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications