ఎన్నో అవరోధాలు అదిగమించి ఏపి ఎదుగుతోంది..! -గవర్నర్ నరసింహన్..!
అమరావతి/ హైదరాబాద్ : ఏపీలో 70వ గణంతత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏపీ స్పెషల్ పోలీస్ సహా పలు విభాగాలు కవాతు నిర్వహించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల శకటాల ప్రదర్శన నిర్వహించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపి ప్రభుత్వం పనిచేస్తోంది..! రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్..!!
నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన అభివృద్ధి జరిగిందని గవర్నర్ నరసింహన్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

అన్ని రంగాల్లో ఏపి దూసుకెళ్తోంది..! ఈజ్ ఆఫ్ డూయింగ్ ను మెచ్చకున్న గవర్నర్..!!
టెక్నాలజీతో ఉత్పాదకతను పెంచుతోందని తెలిపారు. విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నెంబర్ వన్‌గా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. జనవరి నుంచి పెన్షన్లను రూ.2 వేలకు పెంచామని, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మించుకున్నామని తెలిపారు. విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం చేశామని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.

అసెంబ్లీ లో త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన కోడెల..! అభివ్రుద్దికి చిరునామా ఏపీ అన్న స్పీకర్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 70 ఏళ్లలో దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్ని కష్టాలున్నా అధిగమిస్తున్నామని, ప్రపంచంలోనే బాగా వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఏపీ దూసుకెళ్తుందని స్పీకర్ కోడెల చెప్పుకొచ్చారు.

చంద్రబాబు శుభాకాంక్షలు..! లక్ష్యాలకు కేంద్రం సహకరించలేదన్న బాబు..!!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన సందేశానిచ్చారు. ‘ఏపీ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక జరుపుకుంటున్న ఐదవ గణతంత్ర వేడుక ఇది. ఈ ఏడాది మరో ప్రత్యేక కూడా ఉంది. 17వ లోక్‌సభకు జరగనున్న ఎన్నికలు జాతి భవితను నిర్ధేశించే ఎన్నికలు కానున్నాయి. అయితే ప్రజల ఆశలు, లక్ష్యాలకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తూట్లు పొడిచిన నేపథ్యంలో అందరి ఆకాంక్షలు నెరవేర్చే వారికే పట్టం కట్టాల్సిన కీలక బాధ్యతను ఈ గణతంత్రం ప్రజల ముందు ఉంచిందని' సీఎం అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications