నిన్నటి హామీలు రాతపూర్వకంగా ఇమ్మన్న ఏపీ జేఏసీ అమరావతి-సాయంత్రం ఇస్తామన్న సీఎస్..
ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపుపై రాతపూర్వక హామీ ఇమ్మని ఏపీ జేఏసీ అమరావతి కోరడంతో ఇవాళ సాయంత్రం ఇస్తామని సీఎస్ చెప్పారు
ఏపీలో వైసీపీ సర్కార్ నుంచి ఉద్యోగులకు దాదాపు రూ.12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఈ నెల 9 నుంచి అంటే రేపటి నుంచి ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. ఉద్యమానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ నుంచి పిలుపురావడంతో నిన్న చర్చల్లో కూడా పాల్గొంది. అయితే మిగతా ఉద్యోగ సంఘాలు కాస్త రాజీపడినా ఏపీ జేఏసీ అమరావతి మాత్రం రాతపూర్వక హామీ కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు.
ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తేనే ఉద్యమం విరమించుకుంటామని నిన్నటి కేబినెట్ సబ్ కమిటీ చర్చల్లో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రులకు తేల్చిచెప్పేశారు. దీంతో వారు రాతపూర్వక హామీకి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మార్చి 9 నుంచి ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని బొప్పరాజు తెలిపారు. ఇదే అంశాన్ని సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఇవాళ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్ధికపరమైన అంశాలపై నిన్నటి సమావేశంలో ఇచ్చిన హామీ రాతపూర్వకంగా లేకపోతే గతంలోలా మాటతప్పే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.

ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, సకాలంలో జీతాల చెల్లింపుపై గతంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నిన్న కేబినెట్ సబ్ కమిటీ చర్చలకు ఆహ్వానించలేదు. దీంతోపాటు ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఏపీ జేఏసీ అమరావతి నేతలు కూడా ఉద్యమంపై వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా హామీ రాకుండా ఉద్యమం విరమిస్తే కిందిస్దాయిలో ఉద్యోగులకు సమాధానం చెప్పుకోలేని పరిస్దితి ఉందని బొప్పరాజు చెబుతున్నారు.
అయితే ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ తర్వాత ప్రభుత్వం సాయంత్రంలోగా ఆర్ధిక పరమైన అంశాలపై నిన్న జరిగిన భేటీ మినిట్స్ ఇస్తామని సీఎస్ హమీ ఇచ్చారు. దీంతో సాయంత్రం లోగా రాతపూర్వక హామీ కోసం ఎదురుచూస్తామని, మినిట్స్ ఇస్తే దానిపై తమ సమావేశంలో చర్చించి రేపటి ఉద్యమంపై తుది నిర్ణయం తీసుకుంటామని బొప్పరాజు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications