చర్చలు సఫలం: జగన్‌తో వర్చువల్ మీట్.. మంత్రులతో ఒప్పందం

ఉద్యోగ జేఏసీ- మంత్రుల కమిటీతో జరిపన చర్చలు సఫలం అయ్యాయి. ఇవాళ 7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపారు. ఇరువురు కాస్త పట్టు విడుపు ధోరణి అవలంభిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సక్సెస్ అయ్యాయి. దీనికి సంబంధించి కాసేపట్లో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్‌ మీట్‌ పెట్టి చర్చల విషయాన్ని సారాంశాన్ని వివరిస్తారు.

 ap jac and ministers committee discussion are success

హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, పీఆర్సీ కాల పరిమితి, ఐఆర్‌ అడ్జస్ట్‌మెంట్‌, పెన్షనర్ల అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ స్లాబ్‌లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది.

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. చలో విజయవాడ నిర్వహించిన ఉద్యోగులు.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. శనివారం పెన్ డౌన్ చేయాలని నిర్ణయించగా.. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పారు. కానీ చర్చలు సఫలం కావడంతో విరమించుకుంటారు.

ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 23 శాతమే ఇస్తామని మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. అలాగే ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేసేందుకు ఓకే చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాత కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తామని తెలిపింది. పెండింగ్ అంశాలను అభ్యంతరాల కమిటీకి పంపుతామంది. HRA స్లాబుల్లో కనీసం 10 శాతం ఉండేలా మార్పుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అడిషనల్ క్వాoటమ్ ఆఫ్ పెన్షన్ లో కొత్త స్లాబులు. 70-74 ఏళ్ల వరకూ 7 శాతం, 75-79 ఏళ్ల వరకూ 14 శాతం అమలు.

నిన్నటి నుంచి రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు విస్తృతంగా చర్చలు జరిపాయి. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు... హెచ్‌ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, రికవరీ రద్దు, ఐదేళ్ల పీఆర్సీపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించినట్లు తెలుస్తోంది. హెచ్ఆర్ఏ శ్లాబులను కనీసం 12% నుంచి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయగా.. అది కష్టమని మంత్రుల కమిటీ తెలిపింది. దీంతో 10 శాతం, 12 శాతం, 16 శాతం శ్లాబులు నిర్ధారించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరగా.. మంత్రుల కమిటీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+