అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Severe Rainfall Alert:మళ్లీ ఆ 4 జిల్లాలే టార్గెట్.. బెంబేలెత్తుతున్న జనం

|
Google Oneindia TeluguNews

వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇక ఏపీలో అయితే చెప్పక్కర్లేదు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరులో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని అనుకునేలోపు మరో వార్తను తెలియజేసింది వాతావరణ శాఖ. తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటడంతో ఏపీ సరిహద్దు జిల్లాలలో కుంభవృష్టి వానలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తడంతో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ప్రజా జీవనం స్తంభించింది.

ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలోని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోందని, దీంతో ఈ నెల 27 నుంచి ఆయా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

AP Weather News: Severe Rain Alert In andhra pradesh 4 districts

అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో వరద బాధిత జిల్లాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే పెన్నా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరాయి. ఈ నెలలో ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావడం తెలిసిందే.

Recommended Video

Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu

ఈసారి కూడా నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు ఎక్కువగా.. ప్రకాశంలో కాస్త.. వరద ప్రభావంతో తల్లడిల్లాయి. తాజాగా అతి భారీ వర్ష సూచన రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ ఆ జిల్లాలే టార్గెట కావడం.. ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్న క్రమలో వాతావరణ శాఖ చేదు వార్తను తెలియజేసింది.

English summary
Severe Rain Alert In andhra pradesh state weather officials said statement. 4 districts are affected
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X