భీమ్లా నాయక్ అట్టర్ ప్లాప్: మంత్రి వెల్లంపల్లి కామెంట్స్

భీమ్లా నాయక్ మూవీ గురించి ఏపీలో వైసీపీ, జనసేన మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. సినిమాకు అనుకూలంగా, ప్రతీకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మూవీ గురించి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై బుదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 పవన్ మూవీని ఇలా..

పవన్ మూవీని ఇలా..

పవన్ కల్యాణ్ సినిమాను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖండ సినిమా సమయంలో ఏ జీవో ఉందో.. ఇప్పుడు కూడా అదే జీవో ఉందని తెలిపారు. ప్రభుత్వానికి ఏ సినిమా అయినా ఒకటేనని స్పష్టంచేశారు. సినిమా టికెట్ల ధరలపై ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ పెద్దలతో చర్చించారని చెప్పారు.

అటర్ట్ ఫ్లాప్ అట..

అటర్ట్ ఫ్లాప్ అట..

'భీమ్లా నాయక్ సినిమా అట్టర్ ఫెయిల్యూర్ అయిందని వెల్లంపల్లి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి మూవీ బాగుంది.. చాలా మంది అంటున్నారు. కానీ మంత్రి ఇలా అన్నారు. ఆ ఫెయిల్యూరును రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దడానికి.. ఈ సినిమా ద్వారా డబ్బులు సంపాదించుకునేందుకు చూస్తున్నారు. అక్రమ మార్గంలో రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారని ఫైరయ్యారు. అవసరమైతే ఫ్రీగా సినిమాలు చూపిస్తానని అన్నారు. మరీ ఎక్కడ చూపించారు..?' అని వెల్లంపల్లి ప్రశ్నించారు. రూ.100 టికెట్‌ను వెయ్యి రూపాయలకు.. రూ.200 టికెట్‌ను రూ.2 వేలకు అమ్ముకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

నిర్ణయం తీసుకోలే.. కదా..

నిర్ణయం తీసుకోలే.. కదా..

సీఎం జగన్ మోహన్ రెడ్డి సానుకూలం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చిరంజీవి చెబుతున్నారని.. కానీ పవన్, నాగబాబు విమర్శల గుప్పిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా ఇండస్ట్రీపై వారికి ప్రేమలేదన్నారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా కోట్లు దోచుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయ మనుగడ కోసం పవన్ సినిమాకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. అలా వారు కామెంట్ చేయరని విరుచుకుపడ్డారు. దీనిని బట్టి రాజకీయం కోసమే మాట్లాడుతున్నట్టు అర్థం అవుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+