జగన్ మరింత చొరవ చూపాలి.. ఉద్యోగుల ఆందోళనపై జీవీఎల్
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళనకు దిగబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం అర్దరాత్రి నుంచి సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఏపీలో ఉద్యోగుల నిరసన విప్లవ రూపంలా కనిపించిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి నిరసన చేశాయని వివరించారు. బీజేపీ కూడా ఉద్యోగులకు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్య భావనతో, ఉద్యోగుల నిరసనను అవమానించే రీతిలో మాట్లాడిందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల ఆవేదన, నిరసనను ప్రభుత్వం తక్కువ చేసి చూపిందని, ఉద్యోగుల ఆవేదన దేశంలో ఎక్కడా చూడలేదని అన్నారు.

ఉద్యోగుల జీతాలు తగ్గించడం దేశంలో ఎక్కడా చూడలేదని, ప్రభుత్వం అనవసరపు ఖర్చులు ఆపదు కానీ, ఉద్యోగులు త్యాగం చేయాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలు చూడాలో అన్న ఆందోళన ప్రజల్లో ఉందని అన్నారు. పార్లమెంట్ దృష్టికి ఏపీ ఉద్యోగుల ఆందోళనను తీసుకెళ్తానని చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న పెద్ద సవాల్ ఉద్యోగుల సమస్యేనని అన్నారు. ప్రభుత్వం చర్యలు తిసుకోక పోతే సమ్మె ఆలోచనలో ఉద్యోగులు ఉన్నారని, వెంటనే తగుచర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటు ఉద్యోగుల సమ్మెకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మన్మథరావు బెంచ్ పిటిషన్‌ను విచారించింది. ప్రభుత్వ ఉద్యోగుల ర్యాలీ, పెన్ డౌన్, సమ్మెపై ఏపీ హైకోర్టు కామెంట్ చేసింది. చట్టానికి విరుద్ధంగా ఏం జరిగినా దాన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని చెప్పింది.












Click it and Unblock the Notifications