అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం చేశారు..? హోదాకు తెలంగాణ ఆమోదం తెలుపలా..? వైసీపీ ఎంపీలపై జీవీఎల్ ఫైర్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఫైరయ్యారు. వారు ఏదో సాధించారని టీవీల్లో వార్త చూసి కాసేపు సంతోషం కలిగిందని చెప్పారు. కానీ తర్వాతే అసలు విషయం తెలిసిందని చెప్పారు. వాస్తవానికి వారు చేసింది మంచి కాదని.. రాష్ట్రానికి నష్టం కలిగించే పని చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కానీ తాము ఏదో సాధించామని బిల్డప్ ఇచ్చారని పైరయ్యారు.

ఉండేది కాదు.. కానీ

ఉండేది కాదు.. కానీ

ప్రత్యేక హోదా అంశం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రెండు రాష్ట్రాల కమిటీ అజెండాలో ఉండేది కాదన్నారు. కానీ దీనిని వైసీపీ ఎంపీలు చేర్చారని మండిపడ్డారు.
అసలు మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రంతో చర్చించాలా? అని జీవీఎల్ ప్రశ్నించారు. ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రం మనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరిస్తోందా అని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు

 కథనం షేర్

కథనం షేర్

'కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేక హోదా అంశం' అని ఓ టీవీలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించే జీవీఎల్ ట్వీట్ చేశారు. అయితే ఏపీకి హోదా గురించి తెలంగాణ గురించి ఎందుకు చర్చించడం అని ఆయన ప్రశ్నించారు.

ఒత్తిడి తేవడంతో...

ఒత్తిడి తేవడంతో...

ఇటు రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం పరిష్కారం కాకుండా మిగిలిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాల‌ని నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి నేతృత్వంలోని క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న భూటీలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జ‌రుగుతాయి. ఏయే అంశాలు చర్చించాలన్న విష‌యంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్ప‌టికే సమాచారం అందించింది. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జ‌రుపుతామ‌ని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జ‌ర‌గ‌నుంది. స‌మావేశ అజెండాలో ప్ర‌త్యేక హోదా అంశం కూడా ఉంది. దీనిపైనే జీవీఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Recommended Video

Vizag Railway Zone పై క్లారిటీ , Special Status పేరుతో AP కి అన్యాయం | Oneindia Telugu

వీరి నేతృత్వంలో..


వ‌న‌రుల స‌ర్దుబాటు, 7 వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుద‌ల అంశం కూడా ఉన్నాయి. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.

English summary
bjp mp gvl narasimha rao slams ysrcp mp. they include special status in two states discussion
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X