సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు.. కారణమిదే..? హస్తినలో కేసీఆర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్‌కు కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నారు.. కాలు బెణకడంతో పర్యటన అర్ధాంతరంగా ఆగిపోయింది. కాలు నొప్పి నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు బదులు హోంమంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు. ఆమెతోపాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెళతారు. ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీ జరగనున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం జగన్ ఢిల్లీ టూర్ వెళ్లాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ నిర్వహించే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అలాగే పలు కేంద్ర మంత్రులను కూడా కలవాల్సి ఉంది. ఇంతలోనే కాలు నొప్పి కారణంగా పర్యటన రద్దైంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 25న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు.
Recommended Video
26న విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అయితే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం ఆసక్తి రేకెత్తించింది. చాలా కాలం తర్వాత జగన్, కేసీఆర్ కవవబోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సీఎం జగన్ కాలికి గాయమైందంటూ ఢిల్లీ టూర్‌ని రద్దు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications