కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు.. ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ రేటు తక్కువగా ఉన్న జిల్లాల్లో రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కొన్నిరోజుల కిందటే వెల్లడించగా, ఇవాళ జీవో జారీ చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజా కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

కొత్త జీవో ప్రకారం... కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రజా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ఈ నాలుగు జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇక మిగిలిన 9 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలించారు.

curfew to be relaxed in some districts in andhra pradesh

ఏపీ ప్రభుత్వం గతంలో విధించిన కర్ఫ్యూ బుధవారంతో ముగియనుంది. దాంతో జులై 7 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు తాజా జీవోలో పేర్కొన్నారు. పలు జిల్లాల్లో ఆంక్షల సడలింపులు కూడా అప్పటివరకు వర్తిస్తాయి. ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+