లెఫ్ట్ పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ ఫోన్, ఢిల్లీలో లాఠీఛార్జ్‌పై చంద్రబాబు ఆగ్రహం

Recommended Video

    Delhi Police 'Lathicharge' On Special Status Sadhana Committee Activists | Oneindia Telugu

    న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో సీపీఐ, సీపీఎం, ప్రత్యేక హోదా సాధన సమితిల ఆధ్వర్యంలో పార్లమెంటును ముట్టడించే ప్రయత్నాలు చేశారు. వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తదితరులు ఖండించారు.

    హోదా సాధన సమిత ఆధ్వర్యంలో గురువారం జంతర్ మంతర్ వద్ద నిరనస కార్యక్రమం చేపట్టారు. అనంతరం పార్లమెంటు ముట్టడికి బయలుదేరారు. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను ఆందోళనకారులు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో లాఠీఛార్జ్ జరిగింది. వీరి నిరసనకు మద్దతు తెలిపిన టీడీపీ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

    ఖండించిన చంద్రబాబు

    ఖండించిన చంద్రబాబు

    ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై లాఠీఛార్జ్, అరెస్టులను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న వారిపై లాఠీఛార్జి చేస్తారా అని ప్రశ్నించారు.

    నేతలకు పవన్ కళ్యాణ్ ఫోన్

    నేతలకు పవన్ కళ్యాణ్ ఫోన్


    హోదా సాధన సమితి, లెఫ్ట్ పార్టీ నేతలపై లాఠీఛార్జ్‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. లాఠీఛార్జ్‌లో గాయపడిన విద్యార్థులకు పోలీసులు, కేంద్ర ప్రభుత్వం వైద్యం అందించాలన్నారు. పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆందోళనలో పాల్గొన్న వామపక్ష నేతలు మధు, రామకృష్ణకు జనసేననాని ఫోన్‌ చేశారు. హోదా కోసం జరుగుతున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

    మోడీ అహంకార ధోరణి

    మోడీ అహంకార ధోరణి

    దీనిని వామపక్షాలు కూడా ఖండించాయి. లాఠీఛార్జికి నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సీపీఎం నేతలు వెంకటేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తిలు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలు పోరాడుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హోదా, విభజన హామీల కోసం ఢిల్లీలో జరిగిన నిరసనపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఖండించారు. కేంద్రం అహంకార ధోరణి, ఏపీపై ప్రదర్శిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+