అబద్దాలు వల్లెవేశారు.. బూతులు తిడుతున్నారు, దేవినేని ఉమా
ఏపీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైరయ్యారు. ఆయన జీవితం అంతా అబద్ధాల మయం అని మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో సంక్రాంతి కళే లేకుండా పోయిందని చెప్పారు. కనీసం కొత్త బట్టలు కొనుక్కునే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. క్యాసినో వల్ల కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెప్పారు. క్యాసినో నిర్వహించి గతంలో దొరికిపోతే ఓ కేబినెట్ మంత్రి గతంలో పలు వ్యాఖ్యలు చేశారని, ఫైన్ కడతామని మళ్లీ క్యాసినో నిర్వహిస్తామని చెప్పారని దేవినేని ఉమ అన్నారు.
చెప్పినట్లే గోవా సంస్కృతిని ఆ బూతుల మంత్రి గుడివాడకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పేరును పరోక్షంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో పరిస్థితులపై ప్రజలకు సీఎం ముజగన్ ఏం సమాధానం చెబుతారని ఉమా ప్రశ్నించారు. సీఎం అండదండలతో క్యాసినో సంస్కృతి కొనసాగుతోందని ఆరోపించారు. తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ రంగం అభివృద్ధి కోసం కృషి చేశామని, దాని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించామని చెప్పారు.

ఇప్పుడు జగన్ మాత్రం గుడివాడలో క్యాసినో నిర్వహిస్తే రూ.500 కోట్లు వచ్చాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయో ఆలోచిస్తున్నారని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. ఈ రాష్ట్రం ఎటుపోతోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక మీద వచ్చిన ఆదాయం ఎంతని, ప్రభుత్వానికి ఎంత జమ చేశారని నిలదీశారు. ఇవన్నీ అడుగుతున్నామని టీడీపీ నేతలను వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే గౌరవం లేకుండా పోయిందని చెప్పారు. తిట్టడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం చేసే తప్పులను, లోపాలను ఎత్తి చూపడమే తమ బాధ్యత అని దేవినేని ఉమా అన్నారు. అలాంటి ప్రతిపక్షం గొంతునొక్కడం ఏంటీ అని అడిగారు. గతంలో తాము ఇలా వ్యవహరించలేదని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications