ఇక డిజిటల్ చెల్లింపులు, ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలో.. తొలుత ఇక్కడే
ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీలో.. ఎంపిక చేసిన సర్వీసులకు డిజిటల్ విధానంలో టికెట్ జారీ చేస్తున్నారు. దశలవారీగా మిగతా చోట్ల ప్రవేశపెడతారు. ఇక ఏపీలో కూడా డిజిటల్ విధానంలో బస్సు టికెట్ జారీచేయనున్నారు. సో.. జేబులో డబ్బు లేకున్నా ఫరవాలేదు.. కానీ మొబైల్‌లో యూపీఐ ఉండి.. బ్యాంకులో డబ్బులు ఉంటే సరిపోతుంది.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఏపీఎస్ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. విజయదశమికి అవసరమైన ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. గతంలో మాదిరిగా అదనపు చార్జీ తీసుకోలేదు. దీంతో ప్రయాణికుల నుంచి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రయాణికులకు మరో సులభతర వెసులుబాటు కల్పించింది. బస్సుల్లో డిజిటల్ చెల్లింపులతో టికెట్లను విక్రయించేందుకు ఆ సంస్థ తీర్మానించింది.

బస్సులో టికెట్‌కు చెల్లించాల్సిన సొమ్మును ప్రయాణికులు యూపీఐ పేమెంట్ల ద్వారా చెల్లించేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ కొత్త తరహా వెసులుబాటును తొలుత విశాఖ నుంచి నడిచే 97 సర్వీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తోంది. తర్వాత మిగతాచోట్ల కూడా అమలు చేస్తారు. దళల వారీగా అన్ని బస్సుల్లో యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొస్తారు.
పండగ సందర్భంగా ఇప్పటికే స్పెషల్ సర్వీస్ నడిపిన సంగతి తెలిసిందే. రాను, పోను స్పెషల్ బస్సులను వేశారు. ఆ బస్సులకు కూడా అదనంగా చార్జీ తీసుకోలేదు.












Click it and Unblock the Notifications