బలమైన బంధం : అమరావతిలో సింగపూర్ మంత్రి : వెల్‌కం గ్యాలరీ
రాష్ట్ర విభజన నాటి నుండి ఏపి ప్రభుత్వం..సింగపూర్ మధ్య బలమైన బంధం ఏర్పడింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ల రూపకల్పన మొదలు..రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం వరకు ఏపి ప్రభుత్వం ఇక రకంగా సింగపూర్‌నే నమ్ముకుం దని చెప్పుకోవాలి. స్విస్ ఛాలెంజ్ విధానంలోనూ సింగపూర్ సంస్థలకే ప్రభుత్వం రాజధాని లో నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. కొద్ది రోజుల విరామం తరువాత తిరిగి సింగపూర్ మంత్రి అమరావతిలో అడుగు పెట్టారు. ముఖ్యమంత్రి తో కలిసి అమరావతిలో వెల్‌కం గ్యాలరీకి శంకుస్థాపన చేసారు.
మిత్రుడు వచ్చేసారు..సహకారం మరువలేం

అమరావతిలో వెల్‌కం గ్యాలరీకి సింగపూర్ మంత్రి ఈశ్వరన్..ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసారు. ఏపి రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సింగపూర్ తో స మానంగా రాజధాని నిర్మాణం చేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వ్యవహరిస్తామని సీయం చెప్పుకొచ్చారు. అమరావతి ప్రణాళిక కోసం సింగపూర్ ప్రభుత్వాన్నే సంప్రదించామని..అన్నింటిలోనూ ఆ ప్రభుత్వం సహకరిస్తుందని సీయం వివరించారు. అమరావతి వేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ ఓ రూపాన్ని సంతరించుకుంటోందని ఏసి సీయం చెప్పుకొచ్చారు. వెల్‌కం గ్యాలరీ చాలా మందికి అవకాశాలు కల్పిస్తుందని సీయం అభిప్రాయపడ్డారు. సింగపూర్ నుంచి పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. 15 కంపెనీలతో ఏపీ ప్రభుత్వానికి ఒప్పందాలు కుదిరాయి.
రాజధానిలో వెల్కమ్ గ్యాలరీకి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. రాజధాని అభివృద్దికి సింగపూర్ ప్రభుత్వ సహకారం మరువలేనిది, అలాగే 33వేల ఎకరాల భూములిచ్చిన రైతులకూ ధన్యవాదాలు. సింగపూర్ తరహాలో రాజధానిని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నాను. #Janmabhoomi2019 pic.twitter.com/pge5nLQR5r
— N Chandrababu Naidu (@ncbn) January 10, 2019
మాది బలమైన బంధం..
ఏపి ప్రభుత్వం..సింగపూర్ మధ్య ఉన్న బంధం రోజురోజుకీ బలపడుతోందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అన్నారు.
రాజధాని నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లో సహకారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రపంచ దృష్టిని ఆకర్షిం చడంలో వెల్‌కం గ్యాలరీ కీలకంగా మారుతుందని.. దేశ, విదేశాల నుంచి అంతర్జాతీయ సంస్థలు రావాల్సి ఉందన్నా రు. ఏపీ రాజధాని అత్యుత్తమంగా ఎదుగుతుందని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి తో పాటుగా జిల్లాల వారీగా తన అభివృద్ది ప్రణాళికలను వేగవంతం చేసారు. ఇవన్నీ పూర్తి చేయాలంటే తాము తిరిగి అధికారంలోకి వస్తేనే సాధ్యం అవుతుందని ప్రజలకు వివరిస్తున్నారు.