అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెల్త్ వర్సిటీ పేరు మార్పు, గవర్నర్ ఆమోదం, గెజిట్ విడుదల

|
Google Oneindia TeluguNews

డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మారింది. దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ అధికార వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టింది. సభలో ఉన్న బలం ఆధారంగా సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

వర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ సర్కారు తీర్మానం చేసింది. దానికి సోమవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమెదం లభించడంతో ఈ బిల్లును చట్టంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు అధికారికంగా వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మారిపోయింది.

 health varsity name changed as ysr varsity of health sciences

పేరు మార్పుపై అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ససేమిరా ఒప్పుకోలేదు. పేరు మార్చాల్సిన అవసరం ఏముందని అడిగారు. కానీ సీఎం జగన్ వినిపించుకోలేదు. ఏకపక్షంగా ముందుకు వెళ్లారు. తనకు కావాల్సిన నేమ్ ఛేంజ్ మార్చుకున్నారు. పేరు మార్పుపై తారక్ న్యూట్రల్‌గా ఉన్నారు. కానీ మిగతా నేతలు మాత్రం అలా లేరు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కూడా తప్పుపట్టారు. ఎన్టీఆర్ పేరు మార్చడం ఏంటీ అని ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే మార్చలేదని గుర్తుచేశారు. జగన్ ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతున్నారని మండిపడ్డారు.

English summary
health varsity name changed as ysr varsity of health sciences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X