అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవుడు, జగన్ అనుకుంటే తిరిగి మంత్రిని అవుతా..?: బొత్స, తనకు ఆ ఛాన్స్ లేదంటున్న వెల్లంపల్లి

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రివర్గం రాజీనామాతో చర్చ మొత్తం.. కొత్తగా పదవీ లభించేదేవరు అనే అంశం మీదకు వచ్చింది. దీనిపై రాజీనామా చేసిన మంత్రులు స్పందిస్తున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రియాక్టయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గం మారుస్తానని మొదటి శాసనసభా పక్ష సమావేశంలోనే సీఎం జగన్ చెప్పారని ఆయన తెలిపారు. ఇవాళ కూడా అదే విషయం చెప్పారని, తామంతా మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని వెల్లడించారు. సీఎం జగన్ తమకు ఏ బాధ్యతలు అప్పగించినా వాటిని నిర్వహిస్తామన్నారు. తమ లక్ష్యం 2024లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే అని బొత్స సత్యనారాయణ చెప్పారు. తన విషయానికి వస్తే.. దేవుడు, జగన్ తలువాలని... అప్పుడే తనకు తిరిగి మంత్రి పదవీ లభిస్తోందని మనసులోని మాటను బయటపెట్టారు చెప్పారు.

జగన్ ఇష్టం..

జగన్ ఇష్టం..


కేబినెట్ లో ఎవరెవరు ఉండాలి అనేది పూర్తిగా సీఎం నిర్ణయం మీదే ఉంటుందని తెలిపారు. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనే విషయంలో సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. సీనియర్లు ఉంటారా? లేదా? అనేది సీఎం ఇష్టం అని చెప్పారు. పాత కేబినెట్‌లో ఉన్న అన్ని సమీకరణాలు కొత్త కేబినెట్‌లో ఉంటాయన్నారు. బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇప్పటివరకు మూడుసార్లు మంత్రిగా తాను పని చేశానని, అన్నింటికంటే ఇది ఛాలెంజింగ్ పీరియడ్ అని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహిస్తాం అని తెలిపారు. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు.

నాకు నో ప్లేస్..

నాకు నో ప్లేస్..


వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా స్పందించారు. సీఎం నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని తెలిపారు. పార్టీ పరంగా ఆదేశాలను శిరసావహిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది మంత్రులు క్యాబినెట్ లో కొనసాగుతారని, బహుశా ఓ ఐదారుగురు తమ పదవులు నిలుపుకునే అవకాశం ఉందన్నారు. కొత్తవారికి క్యాబినెట్‌లో అవకాశం ఇస్తామని చెప్పారని వివరించారు. తను మంత్రి పదవీలో కొనసాగే అవకాశాలు తక్కువ అని పేర్కొన్నారు. రాజీనామాల విషయంలో తమకంటే సీఎం జగనే ఎక్కువ బాధపడ్డారని వెల్లంపల్లి అన్నారు.

Recommended Video

Ys Jagan సర్కార్ Treasury Code ఉల్లంఘన CAG Sensational Report | Oneindia Telugu
24 మంది రాజీనామా

24 మంది రాజీనామా


సీఎం జగన్‌ ఆధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ నెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సచివాలయంలోని రెండో బ్లాక్‌ ఎదుట ప్రమాణ స్వీకార వేదిక నిర్మించాలని నిర్ణయించారు.. ఆ మేరకు పనులు జరుగుతున్నాయి.

English summary
if god, jagan are decide iam will be a minister botsa satya narayana predicts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X