నేను రాజీనామా చేయలేదు: 22న నామినేషన్ వేస్తున్నా: జనసేన ఎంపీ అభ్యర్థి ఆకుల స్పష్టీకరణ
అమరావతి: జనసేన పార్టీ రాజమహేంద్రవరం లోక్ సభ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ రాజీనామా వ్యవహారం వదంతులు మాత్రమేనని స్పష్టమైంది. తాను పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన వెల్లడించారు. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని తోసి పుచ్చారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
గిట్టని వాళ్లు తనపై తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ఎప్పట్లాగే తాను రాజమహేంద్రవరం లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని అన్నారు. ఈ నెల 22వ తేదీన తాను నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నానని ఆయన వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ఉండటం వల్ల పార్టీ సమావేశాలకు హాజరు కాలేకపోయానని ఆకుల సత్యనారాయణ వివరణ ఇచ్చుకున్నారు.

అంత మాత్రాన తాను రాజీనామా చేసినట్టు కాదని చెప్పారు. అంతకుముందు- తెలుగుదేశం, జనసేన పార్టీ లోపాయకారి ఒప్పందాల వల్ల మనస్తాపానికి గురైన ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వార్తలు వెలువడిన కొన్ని గంటల తరువాత- ఆకుల స్పందించారు. తాను రాజీనామా చేయట్లేదని అన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications