• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ ఇద్ద‌రినీ కేసీఆర్ క‌లుపుతున్నారా : జ‌గ‌న్‌- ప‌వ‌న్ సిద్ద‌మేనా : అదేనా బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్‌..!

|

ఏపి రాజ‌కీయాల్లో హాట్ టాపిక్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు. జాతీయ రాజ‌కీయాల్లో ఎవ‌రి ఫ్రంట్ లో ఎవ రు చేరుతారు. కేసీఆర్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కు ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ఠ్ ఏంటి. దీని పై టిఆర్‌య‌స్ శ్రేణులు.. ఏపిలో రెండు పార్టీల నేత‌ల నుండి అందుతున్న విశ్వ‌స‌నీయ స‌మాచారం మాత్రం ఆసక్తి క‌రంగా మారుతోంది. ఒంటరిగా పోటీ చేస్తా మ‌ని బ‌య‌ట‌కు చెబుతున్న‌ప్ప‌టికీ..ఎన్నికల నాటికి ప‌రిస్థితులు మారుతాయ‌ని కొంద‌రు నేత‌లు బ‌లంగా అంచ‌నాలు వేస్తున్నారు. దీంతో..మ‌రి..కేసీఆర్ ఆ ఇద్ద‌రిని క‌లిపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా.. ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయి..

ఏపిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు..

ఏపిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం త‌మ పై భారీ స్థాయిలో అవి నీతి ఆరోప‌ణ‌లు చేసినా..వాటిని ప‌క్క‌న పెట్టేసిన‌ట్లుగా..ప‌వ‌న్ త‌మ‌తో క‌లిసి రావాలంటూ టిడిపి అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. కానీ, దీని పై లోతుగా ఆలోచ‌న చేసిన ప‌వ‌న్ క‌ళ్యాన్‌..తాము ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని స్ప‌ష్ట‌త ఇ చ్చారు. ఇదే స‌మ‌యంలో తాము వామ‌పక్షాలతో క‌లిసి పోటీ చేస్తామ‌ని తేల్చి చెప్పారు. అయినా..టిడిపి నేత‌లు మాత్రం ఎక్క‌డా ప‌వ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పు బ‌ట్ట‌టం లేదు. ఇప్పుడు కాక‌పోయినా..

ఇక తాడో పేడో: వీధుల్లోకి టిడిపి - బిజెపి: చ‌ంపేందుకే వ‌చ్చారు..!

ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి అయినా ప‌వ‌న్ మ‌న‌సు మార్చుకోబోతారా అనేది వారి ఆశ‌గా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ - ప‌వ‌న్ మధ్య మ‌రింత‌గా గ్యాప్ పెంచి..ప‌వ‌న్ ను అభిమానించే వారు టిడిపికి ఓటు వేయ‌క‌పోయినా..అవి వైసిపి కి మాత్రం ప‌డ‌కూడ‌ద‌నే విధంగా టిడిపి మైండ్ గేమ్ ఆడుతోంది. అదే విధంగా..జాతీయ రాజ‌కీయాల పేరుతో జ‌గ‌న్ - ప‌వ‌న్ ఇద్ద‌రూ ఒకే కూట‌మి లో చేరితే..రాజ‌కీయంగా ఎదుర‌య్యే ప‌రిణామాల‌ను దృష్టిలో పెట్టుకొని టిడిపి..ప‌వ‌న్ తో మైత్రి కోరుకుంటోంది. కానీ, వీట‌న్నింటిని..టిడిపి ఆలోచ‌న‌ల‌ను ప‌సి గ‌ట్టిన ప‌వ‌న్ ..స్ప‌ష్టంగా త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

జ‌గ‌న్ క్లియ‌ర్‌..మ‌రి, ప‌వ‌న్‌...

జ‌గ‌న్ క్లియ‌ర్‌..మ‌రి, ప‌వ‌న్‌...

ఏపి రాజ‌కీయాల్లో ఇప్పుడు ప‌వ‌న్ వెనుక వామ‌ప‌క్షాలు ఉన్నాయి. టిడిపి- కాంగ్రెస్ పొత్తు ఉంటుందా - ఉండ‌దా అనే సందేహం ఇంకా వీడ‌లేదు. ఇదే స‌మ‌యంలో వైసిపి తో క‌లిసేందుకు మాత్రం ఓపెన్ గా ఎవ‌రూ ప్ర‌స్తుతానికైతే సిద్దంగా లేరు. ఇక‌, జాతీయ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు కాంగ్రెస్ అనుకూల ఫ్రంట్ కోసం యాక్టివ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రో కూట‌మి ఎన్డీఏ మ‌ద్ద‌తు పార్టీలు. ఇవ‌న్నీ ఇలా ఉంటే..కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో త‌ట‌స్థ పార్టీల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మ‌రి..ఏపిలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఉన్న జ‌గ‌న్..ప‌వ‌న్ ఏ కూట‌మిలో చేరుతార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. అయితే, జ‌గ‌న్ మాత్రం ఎన్నిక‌ల త‌రువాత ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా..ఏపికి ప్ర‌త్యేక హోదా ఎవ‌రు ఇస్తారో వారికే త‌న మ‌ద్ద‌తు అని ఇప్ప‌టికే తేల్చేసారు. ప‌వ‌న్ సైతం ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తారో ఓపెన్ అవ్వ‌లేదు. అయితే, చంద్ర‌బాబు ఉన్న కాంగ్రెస్ ఫ్రంట్‌..బిజెపి ఫ్రంట్ కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశాలు లేవు. దీంతో..ఆయ‌న సైతం జ‌గ‌న్ త‌ర‌హాలోనే త‌న నిర్ణ‌యం ఎన్నిక‌ల త‌రువాత అని ప్ర‌క‌టిస్తారా లేక కేసీఆర్ ప్ర‌తిపాదిత ఫ్రంట్ లో చేరుతారా అనేది తేలాల్సి ఉంది.

ఆ ఇద్ద‌రిని కేసీఆర్ క‌లుపుతారా ..క‌ల‌వ‌టం సాధ్య‌మేనా..!

ఆ ఇద్ద‌రిని కేసీఆర్ క‌లుపుతారా ..క‌ల‌వ‌టం సాధ్య‌మేనా..!

ఇక‌, కొద్ది రోజులుగా ఏపిలోని టిడిపి నేత‌లు కొత్త స్లోగ‌న్ తెర పైకి తీసుకొచ్చారు. జ‌గ‌న్ - ప‌వ‌న్ ల‌ను క‌లిపి..ఇద్ద‌రినీ క‌లిపి ఎన్నిక‌ల్లో పోటీ చేయించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. దీని కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క భూమిక పోషిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. జ‌గ‌న్ -వ‌ప‌న్ ఇద్ద‌రూ క‌లిస్తే ఇక‌,టిడిపి కోలుకొనే ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. దీని కోస‌మే వారిద్ద‌రి మ‌ధ్య పొత్తు కుదిర్చే బాధ్య‌త కేసీఆర్ తీసుకున్నార‌న్న‌ది టిడిపి నేతల వాద‌న‌. అయితే, ఇప్ప‌టి కే జ‌గ‌న్ -వ‌ప‌న్ మ‌ధ్య కొన్ని సంద‌ర్బాల్లో మాట‌కు మాట‌లు తూటాల్లా పేలాయి.

ఇద్ద‌రి మ‌ధ్య పొత్తు కుదురుతుంద‌ని గ‌తంలోనూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ ను చంద్ర‌బాబు పార్ట‌న‌ర్‌గానే అభివ‌ర్ణిస్తున్నారు. ప‌వ‌న్ సైతం జ‌గ‌న్ ను విమ‌ర్శిస్తున్నారు. అయితే, చంద్ర‌బాబు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే జ‌గ‌న్ - ప‌వ‌న్ ల మ‌ధ్య పొత్తు అనివార్య‌మ‌ని ఆ ఇద్ద‌రికి చెబుత‌న్న‌ట్లు స‌మాచారం. దీని కోసం జ‌గ‌న్ - ప‌వ‌న్ ఇద్ద‌రి తో స‌ఖ్య‌త‌గా ఉండే కేసీఆర్ ఆ బాధ్య‌త తీసుకున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. కేసీఆర్ ఈ బాధ్య‌త‌ను దృష్టిలో ఉంచుకొనే..స‌క్సెస్ అవుతా న‌నే ధీమాతోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని చెబుతున్నార‌నేది మ‌రో విశ్లేష‌ణ‌. మ‌రి.. జ‌గ‌న్ - ప‌వ‌న్ ఇద్ద‌రూ క‌లిసి పోటీ చేయ‌టానికి అంగీక‌రిస్తారా..రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌చ్చు..చూడాలి ఏం జ‌రుగుతుందో..

English summary
Interesting Equations in AP Politics. TDP leaders doubting that KCR trying to fix alliance between Jagan and Pawan. This only the return Gift from KCR. But, Jagan and pawan already stated that they will fight alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X