కాంగ్రెస్ కు కిశోర్ చంద్రదేవ్ గుడ్ బై : టిడిపి లోకి ఎంట్రీ..! వైసిపికి నష్టమా....!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కిషోర్ చంద్రదేవ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారం కోల్పోయిన తర్వాత గత నాలుగేళ్లుగా పార్టీలో రాజకీయ శూన్యత ఆవహించిందని కిశోర్ చంద్రదేవ్ ఆరోపించారు.అయితే, ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరుతారా..
నాలుగు దశాబ్దాలకు పైగా సుమారు 45 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసిన కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీకి విజయ నగ రం జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రధానంగా ఎస్టీ నియోజకవర్గాల్లో ఆయన కీలకంగా మారారు. ఆరుసార్లు లోక్‌సభ కు ఎన్నికైన కిషోర్ చంద్ర దేవ్ రాజ్యసభకు ఒక సారి ఎన్నికయ్యారు. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడ్డ చరణ్‌సింగ్ ప్రభుత్వంలోను, మన్మోహన్‌సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వంలోను కిశోర్ చంద్రదేవ్ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో విభజనకు అనుకూలంగా వ్యవహరించారు. ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసిన తరువాత ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టత ఇవ్వకపోయినా..ఆయన టిడిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టిపాజిట్ కోల్పోయిన ఆయన ను తమ పార్టీలోకి టిడిపి ముఖ్యనేత ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో..ఆయన టిడిపిలో చేరుతారని చెబుతున్నారు.

వైసిపి కి నష్టమేనా..!
సీనియర నేత..గిరిజన నియోజకవర్గాల కు ప్రతినిధిగా సుదీర్ఘ కాలం పని చేసిన కిశోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరితే ఇక వైసిపి ఆ నియోకవర్గాల్లో ఎటువంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది. 2014 ఎన్నికల నాటికి టిడిపి లో బల మైన గిరిజన నేత లేకుండా పోయారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో గిరిజన నియోజకవర్గమైన అరుకు లోక్‌సభ తో పాటు గా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసిపి గెలిచింది. గిరిజన ప్రాంతాల్లో బలంగా ఉన్న వైసిపిని దెబ్బతీసేందుకు ఆ వర్గ ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకోవటం టిడిపి నేతలు ప్రారంభించారు. 2014 లో వైసిపి నుండి అరుకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత సైతం టిడిపిలో చేరినా..ప్రస్తుతం సొంత పార్టీ ఏర్పాటు చేసారు. దీంతో..కిశోర్ చంద్ర దేవ్ ను తమ పార్టీలోకి చేర్చుకోవాలని టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి..ఆయన ప్రభావం ఇప్పుడు వైసిపి మీద ఎంత వరకు ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం వైసిపి నుండి వచ్చే ఎన్నికల్లో అరకు ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే దాని పై ఇంకా స్పష్టత రాలేదు. కిశోర్ చంద్ర దేవ్ టిడిపి నుండి బరిలోకి దిగితే...వైసిపి నుండి ఎవరు పోటీలో ఉంటారో చూడాలి. ఇదే సమయంలో..సుదీర్ఘ కాలంగా కిశోర్ చంద్ర దేవ్ కు వ్యతిరేకంగా పని చేసిన టిడిపి శ్రేణులు ఆయన పార్టీలో చేరితే ఎంత వరకు సహకరిస్తారో అనేది వేచి చూడాల్సిందే.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications