విశాఖలో టీడీపీ నేతల భూ కబ్జాలు.. అంబటి రాంబాబు ఆరోపణలు
విశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు.. ప్రభుత్వ భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు పెడుతోందని మండిపడ్డారు. లీజులు ముగిసినా కూడా భూములు ఖాళీ చేయలేదన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

గతంలో చేసిన వ్యాఖ్యలు అయ్యన్న మర్చిపోయారా? భూ కబ్జాలపై అప్పటి మంత్రి అయ్యన్న ఫిర్యాదు చేసింది గుర్తులేదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. విశాఖలో భూ కబ్జాలపై ఎల్లో పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని.. ముస్లిం వక్ఫ్ భూములను కూడా టీడీపీ నేతలు వదల్లేదన్నారు. ''టీడీపీ నేతల భూకబ్జాలను చంద్రబాబు సమర్ధిస్తారా?. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటే కక్షసాధింపు ఎలా అవుతుంది అని అడిగారు.
ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచుకుంటే చూస్తూ ఊరుకోవాలా?. టీడీపీ నేతలు భూకబ్జాలు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా?. చంద్రబాబుకు అధికార, ధనకాంక్ష తప్ప మరో ఆలోచన లేదంటూ'' అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే అంబటి అన్నారు. ఆ మేరకు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వివరించారు.












Click it and Unblock the Notifications