కరోనా పరిహారం కోసం పోర్టల్.. ఇలా ఆప్లై చేసుకొండి, ఏపీ సర్కార్ సూచన
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ సోకిన వారిలో కొందరు మృత్యువాత పడుతున్నారు. అయితే కరోనా సోకి చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తోంది. ఆర్థిక సాయం నేరుగా బాధిత కుటుంబాలకే చేరే విధంగా ఓ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు పరిహారం చెల్లించడానికి ఆన్ లైన్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

నోటిఫికేషన్ విడుదల
కోవిడ్ పరిహారం కోసం రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వీ ఉషారాణి నోటిఫికేషన్ విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా డబ్బు అందేలా చూస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు http://covid19.ap.gov.in/exgratia పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం బాధితులు మృతుడికి కోవిడ్ నిర్థారించిన ఆర్‌టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్ రిపోర్టులలో ఏదో ఒక డాక్యుమెంట్‌ను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

నేరుగా బాధితుల ఖాతాలో జమ
ఆ సదరు డాక్యుమెంట్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు బాధితుల ఖాతాలోకి డబ్బు జమచేస్తారు. నగదు పంపిణీలో అవకతవకలు జరగకూడదనే ఈ పోర్టల్ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో నేరుగా బాధితుల కుటుంబాలకు నగదు అందనుంది. లేదంటే ఇతర మార్గాల ద్వారా లేదంటే.. అధికారుల నుంచి నగదు అందితే వారు లంచం తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఏపీ, తెలంగాణ.. కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఆన్ లైన్ చేశాయి. దీంతో పారదర్శకంగా బాధితులకు నగదు చేరుతుంది.

27 మందికి కరోనా..
ఇటు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో ఒక కేసు కూడా నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే విదేశాల నుంచి వచ్చిన 27 మందికి కరోనా వచ్చింది. వీరిలో ఒమిక్రానా లేదా అనే అంశం తేలాల్సి ఉంది. వీరితో సన్నిహితంగా ఉన్న 9 మందికి కూడా కరోనా సోకింది. ఫస్ట్ పాజిటివ్ వచ్చి తర్వాత నెగిటివ్ వచ్చిన వారు 8 మంది ఉన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఏపీకి 26 వేల మంది వచ్చారట..వారిలో వెయ్యి మంది ఆచూకీ తెలియలేదని సమాచారం.












Click it and Unblock the Notifications