23 శాతం ఫిట్ మెంట్, పెరిగిన హెచ్ఆర్ఏ, తర్వలో పీఆర్సీ నివేదిక: సజ్జల

హమ్మయ్యా ఉత్కంఠకు తెరపడింది. మరో 24 గంటల్లో మోగే సమ్మెకు బ్రేక్ పడింది. మంత్రుల కమిటీతో జేఏసీ స్టీరింగ్ కమిటి జరిపిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. దీంతో ఉద్యోగులు యథావిధిగా విధుల చేయబోతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యమయ్యాయని వివరించారు. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేశామని సజ్జల వివరించారు. గతంలో నిర్ణయించిన విధంగా ఫిట్‌మెంట్ ఇస్తున్నామని.. ఇందులో ఎలాంటి మార్పులేదని స్పష్టంచేశారు. HRA శ్లాబులు స్వల్పంగా పెరిగిందని చెప్పారు. పీఆర్సీ నివేదికను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

థాంక్స్

థాంక్స్

ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ తెలిపారు. అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారని పేర్కొన్నారు. అడగకుండానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌కు ఎంతో ప్రేమ ఉందన్నారు. సీఎం జగన్ పై ఉద్యోగులకు నమ్మకం ఉందని చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని సీఎం జగన్ ఎప్పుడూ చెబుతుంటారని గుర్తుచేశారు. అంతా ఒక కుటుంబంగా పనిచేయాలని సీఎం జగన్ చెప్పేవారని తెలిపారు. ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆవేదనతో ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశామని.. ఉద్యోగులు అన్న మాటలను మరోలా భావించొద్దు అని సూచించారు. సమ్మెను విరమించుకుంటున్నామని తెలియజేశారు.

 వర్చువల్‌గా మాట్లాడిన జగన్

వర్చువల్‌గా మాట్లాడిన జగన్

స్టీరింగ్ కమిటీ సభ్యులు.. సీఎం జగన్‌తో వర్చువల్ గా మాట్లాడారు. మంత్రుల కమిటీ అంగీకరించిన డిమాండ్లపై ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఒప్పంద పత్రాన్ని అధికారులు సీఎం జగన్‌కు పంపారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. పీఆర్సీ ఆశించినంతగా లేకపోవడంతో అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగుల ఆవేదన గురించి మంత్రుల కమిటీ చర్చించిందన్నారు. అన్ని అంశాలపై లోతుగా చర్చించి ఏకాభిప్రాయంకి వచ్చామన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అంతా ఓ కుటుంబంలా ఉండాలన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చెయ్యడంలో ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. ఉద్యోగులు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలని సీఎం జగన్ అనుకుంటారని సజ్జల అన్నారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి అంశంపైనా లోతుగా చర్చించామని అన్నారు.

 23 శాతం ఫిట్ మెంట్

23 శాతం ఫిట్ మెంట్

'జీవో ఇవ్వగానే రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఫిట్ మెంట్ 23 శాతంలో ఎలాంటి మార్పు లేదు. 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో 16 శాతం HRA ఇవ్వడానికి అంగీకరించారు. HOD, సచివాలయంలో ఉద్యోగులకు జూన్ 2024 వరకూ 24 శాతం HRA ఇవ్వడానికి అంగీకారం. పెన్షనర్ల 70 నుండి 74 వారికి 7 శాతం.. 74 నుండి 79 శాతం 12 శాతం. పీఆర్సీ ఐదేళ్ల పాత పద్దతి కొనసాగుతుంది. CCL పాత రేట్లు ప్రకారమే కొనసాగుతుంది. ఆర్టీసీ, యూనివర్సిటీలకు సెపరేట్ పీఆర్సీ జీవో విడుదల అవుతుంది" అని సజ్జల తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+