బాబుకు మతి భ్రమించింది.. అందుకే ఇలా.. పార్థసారథి విసుర్లు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతిభ్రమించిందని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కామెంట్ చేశారు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయిన తరువాత రాష్ట్రాన్ని, ప్రజలను వదిలి హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబు.. జూమ్‌ యాప్‌ ద్వారా కాలం వెల్లదీస్తున్నాడని పార్థసారథి విమర్శించారు.తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కొలుసు పార్థసారధి మీడియాతో మాట్లాడారు.

విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని బషీర్‌బాగ్‌లో చేపట్టిన రైతులపై పోలీసులతో చంద్రబాబు కాల్పులు జరిపించి రేపటికి 21 సంవత్సరాలు అని పార్థసారథి గుర్తుచేశారు. మొదటి నుంచీ చంద్రబాబు రైతు వ్యతిరేకిగా, ప్రజా వ్యతిరేకిగానే ఆలోచన చేశాడని మండిపడ్డారు. ప్రజలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేరని మండిపడ్డారు. బషీర్‌బాగ్‌లో ఆ రోజు పోలీసులతో రైతులపై కాల్పులు జరిపించిన ఘటన ఈ రోజుకీ రైతులు మర్చిపోలేదన్నారు.

ysrcp mla kolusu parthasarathy slams tdp chief chandrababu naidu.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. తనకున్న టక్కుటమారాలతో కేంద్రానికి కంప్లయింట్‌ చేస్తున్నాడని కొలుసు పార్థసారథి ఆరోపించారు. తన లాయర్లతో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను నిలిపివేయాలని కోర్టులో కేసు వేయించే దుస్థితికి, దౌర్భాగ్యానికి చంద్రబాబు దిగజారిపోయాడనిఎమ్మెల్యే హాట్ కామెంట్స్ చేశారు.

చంద్రబాబు తీరు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న గొప్ప కార్యక్రమాలను ప్రపంచంలోని మేధావులు మెచ్చుకుంటున్నారన్న పార్థసారథి అన్నారు. వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకోవాలని ఆలోచన చేస్తున్న నీచుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

బహుశా రాజకీయాల్లో ఇలాంటి నీచ మనస్తత్వం ఉన్నవారు ఎవరూ ఉండరేమో అంటూ పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా.. స్వార్థంగా మలచుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని మండిపడ్డారు. ఆయ నీచ రాజకీయాలు జనాలకు అందరికీ తెలుసు అని చెప్పారు. గత ఎన్నికల్లో అందుకే ప్రతిపక్ష స్థానంలో కూర్చొబెట్టారని పేర్కొన్నారు. అయినా చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+