అన్నదాతలను ఆదుకోండి, రైతుల వెతల వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్..
నివర్ తుపాన్ బీభత్సంతో అన్నదాత నడ్డి విరిగింది. రైతులతోపాటు కౌలు రైతుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరి బాధలను టీడీపీ నేత నారా లోకేశ్ ప్రస్తావించారు. వారి సమస్యలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆ రైతుల సమస్యలు పట్టడం లేదా అని అడిగారు. వారిని ఆదుకోవాలని కోరారు.
తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలతో ఏపీలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికి అందిన పంట తుపాను పాలయ్యింది. సర్వం కోల్పోయిన రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారని నారా లోకేశ్ వెల్లడించారు. కౌలు రౌతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులు వేడుకుంటున్నా సీఎం జగన్ మనసు కరగడం లేదని విమర్శించారు. ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం అని అడిగారు.

ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని లోకేశ్ అన్నారు. ఆ రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులను వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఓ కౌలు రైతు ఎకరం 30 వేలకు తీసుకున్నాడు.. రూ.15 వేల పెట్టుబడి పెట్టాడు. కానీ చేతికొచ్చిన పంట మాత్రం నీట మునిగింది. ఇలా పలువురు ఆ వీడియోలో తమ గోడును వెల్లబోసుకున్నారు. మరో రైతు రూ.50 వేల పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు.
సర్వం కోల్పోయిన రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కౌలు రైతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న వేడుకుంటున్నా @ysjagan మనస్సు కరగడం లేదు. ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం??(1/2) pic.twitter.com/5ZsgD3H4Uh
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 8, 2020
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications