మంత్రులు/ నేతలపై చర్యలేవీ, ఎస్ఈసీపై వర్ల రామయ్య ఆగ్రహం.. తలొగ్గారని కామెంట్స్

ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి దశ విజయవంతం కాగా.. రెండో, మూడో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీ సర్కార్‌కు తలొగ్గినట్టు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి నిమ్మగడ్డ.. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కానీ టీడీపీ నేత వర్ల రామయ్య నిమ్మగడ్డను వెలేత్తి చూపడం చర్చకు దారితీసింది. కానీ తన పని తాను చేసుకుంటున్నానని నిమ్మగడ్డ చెబుతున్నారు.

అనూహ్యంగా వర్ల రామయ్య కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాజువల్‌గా కాకుండా.. వైసీపీ అరాచకాలకు ఎస్‌ఈసీ తలొగ్గినట్లు ఉందని వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో మంత్రులు, నేతలపై నామమాత్రపు చర్యలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దీంతో సర్కార్‌కు నిమ్మగడ్డ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. అంతకుముందు ఏకగ్రీవాలను అంగీకరించడం కూడా ఆ కోవలోకే వస్తుందని చెప్పారు.

sec scare of ministers/mlas in the state: varla ramaiah

పంచాయతీ ఎన్నికల సందర్భంగా వివిధ ఫిర్యాదులపై వైసీపీ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జోగి రమేష్‌ ఆరేళ్లు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని వర్ల రామయ్య కోరారు. మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారడ్డి, కొడాలి నానిపై ఎస్‌ఈసీ ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నారని అడిగారు. వారిపై ఎస్ఈసీ చర్యలు తీసుకోకపోవడానికి గల కారణం ఏంటీ అని అడిగారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+