ప్రేమలేఖలతో సరిపెడతారా.. జగన్‌పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల జగడం పీక్‌కి చేరుతోంది. తెలంగాణ మంత్రులు.. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జల వివాదం నేపథ్యంలో ఏఫీ టీడీపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ సర్కారుపై విమర్శల దాడిని తీవ్రతరం చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అటాక్ చేశారు. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరితో రాయలసీమ ప్రమాదంలో పడిందని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమకు ఈ పరిస్థితి వస్తే, ప్రేమలేఖలతోనే సరిపెడతారా సీఎం జగన్ అంటూ సెటైర్లు వేశారు. రోజూ 8 వేల క్యూసెక్కుల నీరు వృథా సముద్రం పాలవుతుంటే నోరు విప్పరా? అంటూ ప్రశ్నించారు.

somireddy chandramohan reddy slams cm ys jagan

కనీసం కేసీఆర్ పేరు ఎత్తడానికి భయపడుతున్నారా? అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. ఇక ఢిల్లీ వెళ్లి తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు స్పందించకపోతే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైరయిన సంగతి తెలిసిందే. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్‌ఆర్‌ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్‌ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు అని శ్రీనివాస్ గౌడ్ ఫైరయ్యారు. నీటి గొడవ, ఇతర అంశాలపై సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. అని ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఆయనది అని విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+