అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరగుజ్జు ఆలోచనలు: సాయిరెడ్డిపై వీర్రాజు విసుర్లు.. మీరా చెప్పేది అంటూ

|
Google Oneindia TeluguNews

గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్పు అంశం కాక రేపుతుంది. దీనిపై ప్రతిపక్ష- అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ క్రమంలోనే వైసీపీ కీలకనేత విజయసాయి రెడ్డి బీజేపీ నేతలపై విరుచుకుపడగా.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కేజీహెచ్ పేర్లు మార్చాలంటున్న ఏపీ బీజేపీ నేతలవి మరగుజ్జు ఆలోచనలు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించగా.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన శైలిలో స్పందించారు.

ఎలా దోచుకోవాలో..

ఎలా దోచుకోవాలో..


రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉండే మీలాంటి వారితో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో ఏపీ బీజేపీ లేదని సోము వీర్రాజు బదులిచ్చారు. నిత్యం ల్యాండ్, శాండ్, వైన్ ద్వారా పేద ప్రజల కష్టాన్ని పీక్కుతినే రాబందుల వంటి మీరా మాకు హితబోధ చేసేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ భూములపై కన్నేసి మూడు రాజధానులు అంటూ కుట్రలకు తెరదీసిన మీ నీతులు మాకు అవసరంలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

 నమో: నమ:

నమో: నమ:

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేదీ, అమరావతిని నిర్మించేదీ, విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేదీ, ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇచ్చేదీ, రాష్ట్రంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తున్నదీ నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని సోము వీర్రాజు ఉద్ఘాటించారు. దేశ ద్రోహుల పేర్లు మీరు మార్చకపోతే, ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా వాటి పేర్లు మార్చుతుందని స్పష్టం చేశారు.

Recommended Video

Swami Paripoornananda Slams Ys Jagan.. హిందూ పండగలపై ఆంక్షలెందుకు? | Oneindia Telugu
 ఇదీ విషయం

ఇదీ విషయం


జిన్నా టవర్ అంశంపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బీజేపీ జాతీయ స్థాయి నేత సత్యకుమార్ ఆజ్యం పోశారు. గుంటూరు జిన్నా టవర్‌పై చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. గుంటూరులో ఉన్న జిన్నా టవర్‌ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన బీజేపీ నేత సత్య కుమార్‌.. 'ఈ టవర్‌కు జిన్నా పేరు మీద పెట్టారు. ఈ ఏరియాను జిన్నా సెంటర్‌గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్థాన్‌లో కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన అలీజిన్నా పేరును ఇంకా టవర్‌కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్‌కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్‌ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు.? ఒక సూచనగా చెబుతున్నాను' అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. అదీ అగ్గిరాజేసింది. దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. బీజేపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది.

English summary
andhra pradesh bjp chief somu verraju angry on ysrcp mp vijaya sai reddy. jinnah tower row continue in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X