అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ,75కే చీప్ లిక్కర్: సోము వీర్రాజ్ సెన్సేషనల్ కామెంట్స్..

|
Google Oneindia TeluguNews

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అంటూ మాట్లాడారు. పనిలో పనిగా సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై మాట తప్పారని విమర్శించారు. ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ మడమ తిప్పారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

రూ.75కే చీప్ లిక్కర్

రూ.75కే చీప్ లిక్కర్

సినీ పరిశ్రమను మట్టుబెట్టేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాని కోరారు. అలాగే రాష్ట్రంలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలని డిమాండ్ చేశారు. 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జోస్యం చెప్పారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రూ.75లకు చీప్ లిక్కర్ అమ్మనుందని స్పష్టం చేశారు. ప్రజాగ్రహ సభ ద్వారా తమ సత్తా ఏంటో చూపిస్తామని కామెంట్ చేశారు.

 ధర తగ్గింపు

ధర తగ్గింపు

చీప్ లిక్కర్ ధర తగ్గిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ధర తగ్గిస్తామని చెప్పారు. మద్యం కొనుగోలు దారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆచరణ సాధ్యమేనా అనే సందేహాం వస్తోంది. ఎందుకంటే జగన్.. లిక్కర్ పాలసీ అని చెప్పారు. ధరలను ఆమాంతం పెంచారు. ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ మాత్రం.. ధరలను తగ్గిస్తూ వస్తున్నారు. దీనిని సోము వీర్రాజు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అంటూ ఊరించే ప్రయత్నం చేశారు.

 ఒక్క ఛాన్స్ ప్లీజ్

ఒక్క ఛాన్స్ ప్లీజ్

మందు బాబులను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అదీ అచరణ సాధ్యం అవుతుందో లేదో చూడాలీ. ఎందుకంటే ప్రాక్టికల్‌గా వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఓ రాయి అయితే వేసి చూశారు. అంతకుముందు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11వేల కోట్లు ఇచ్చామ‌ని.. మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. దీన్ని త్వరలో విడుదల చేస్తారని.. ప్రాజెక్ట్ కట్టిన లెక్కల ప్రకారం నిధులను విడుదల చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారని ప్ర‌శ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. పదవులు ఆశించి పని చేయలేదని.. తనకు సీఎం అవ్వాలని లేదని చెప్పారు.

English summary
andhra pradesh state bjp president somu verraju made sensational comments on cheap liquor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X