మూడురోజుల్లో ఎస్ఎస్‌సీ ఫలితాలు: అందరూ పాసే, ఈ విధంగా: మంత్రి సురేశ్

పదో తరగతి ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన చేశారు. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. కరోనా వైరస్ వల్ల పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులు అందరూ పాస్ అయినట్లేనని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని 2020, 2021 సంవత్సరాల్లో పది విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు.

స్లిప్ టెస్టులకు 70 శాతం, ఫార్మాటివ్ ఎసెస్ మెంట్‌కు 30% వెయిటేజ్‌తో మార్కుల కేటాయింపు చేశామని మంత్రి సురేశ్ తెలిపారు. ఛాయారతన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టంచేశారు. 6.28 లక్షల మంది విద్యార్థులు రిజల్ట్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంసెట్ ర్యాంక్స్‌లో ఇంటర్‌కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని మంత్రి సురేష్ మరోసారి స్పష్టం చేశారు. గతవారం ఇంటర్‌ ఫలితాలు విడుదల చేశారు.

ssc results will come three days:minister adimulapu suresh

కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. బోర్డు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుబట్టింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేసింది.

కరోనా వైరస్ వల్ల విద్యా సంవత్సరాలు పొడగిస్తు వస్తున్నారు. పిల్లలకు ఆన్ లైన్ తరగతులు నడుస్తున్నాయి. 9, 10.. ఇంటర్ విద్యార్థులు కూడా ప్రమోట్ అవుతున్నారు. సీబీఎస్ఈ కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది. కానీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మాత్రం నిర్వహించాల్సి వస్తోంది. మిగతా అన్నీ పరీక్షలను రద్దు చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+