ఏపీ గురించి తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు? డాటా కేసుపై టీడీపీ నేతల గుస్సా

అమరావతి : ఏపీ ఓటర్ల డాటా చోరీ కేసు నేతల మధ్య చిచ్చు రేపుతోంది. చినికి చినికి గాలివానలా మారినట్లు ఏపీ, తెలంగాణ మధ్య పెద్ద దుమారంలా మారింది. తెలంగాణలో కేసు నమోదైంది కాబట్టే మా పోలీసులు విచారణ చేస్తున్నారని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో మీ జోక్యమేంటని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో డాటా కేసు కాస్తా వార్ లా పరిణమించింది. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.

టీఆర్ఎస్ కుట్ర.. డిలీషన్ లో వాళ్లే ముందు

టీఆర్ఎస్ కుట్ర.. డిలీషన్ లో వాళ్లే ముందు

తెలంగాణలో చేసిన కుట్రలే ఏపీలో చేయాలని సీఎం కేసీఆర్ ప్లాన్ వేశారని ఆరోపించారు మంత్రి దేవినేని. జగన్మోహన్ రెడ్డి కోసం కేసీఆర్ పడుతున్న శ్రమ అందరూ గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో డెవలప్ మెంట్ టెక్నాలజీ ఉంటే.. తెలంగాణలో డిలీషన్ టెక్నాలజీ ఉందన్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు కేసీఆర్ తీసివేయించడంతోనే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో జతకట్టిన జగన్.. ఏపీ పోలీసులపై కేసులు నమోదు చేయిస్తున్నారని తెలిపారు.

టీడీపీ డాటాను కేసీఆర్ సహకారంతో వైసీపీ నేతలు తస్కరించారని ఆరోపించారు దేవినేని. అందుకు సంబంధించి ఆధారాలు బయటపెట్టారు. గొల్లపూడికి చెందిన శీను నాయక్ అనే టీడీపీ కార్యకర్తకు వైసీపీ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. దాని తాలూకు వాయిస్ రికార్డును మీడియా ప్రతినిధులకు దేవినేని వినిపించారు. అదలావుంటే పక్క రాష్ట్రం నుంచి వస్తున్న కొందరు ఓటుకు 5వేల రూపాయలిస్తామంటూ ఆశ పెడుతున్నారని ఆరోపించారు. అలాంటివారిని స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పజెప్పినట్లు గుర్తుచేశారు.

రాద్ధాంతమెందుకు : కోడెల

రాద్ధాంతమెందుకు : కోడెల

ఏపీ ఓటర్ల డాటా చోరీ అయిందంటూ తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందంటూ మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్. ఐటీ గ్రిడ్ సంస్థ కేసులో తెలంగాణ సర్కార్ తీరు సరికాదంటూ ఫైరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహార శైలి సరిగా లేదని ధ్వజమెత్తారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన కేసులో మరో రాష్ట్ర ప్రభుత్వం తలదూర్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. డాటా కేసుపై అనవసర రాద్ధాంతం చేయొద్దంటూ హితవు పలికారు.

జగన్ పై గులాబీ ప్రేమ మర్మమేంటో?

జగన్ పై గులాబీ ప్రేమ మర్మమేంటో?

ఒకప్పుడు జగన్ ను అవినీతి చక్రవర్తిగా తిట్టినోళ్లే.. ఇవాళ ఆయన చెంతకు చేరడం విస్మయం కలిగిస్తోందన్నారు టీడీపీ సీనియర్ లీడర్ రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఆనాడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన టీఆర్ఎస్ నేతలు ఇవాళ జై కొట్టడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. జగన్ అవినీతిపై కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు, కవితేమో పత్రికాముఖంగా ఎన్నోసార్లు విరుచుకుపడ్డారు, హరీశ్ రావు కూడా ఆయనకు జై కొడితే అవినీతికి జై కొట్టినట్లేనని వ్యాఖ్యానించారు.. మరి ఇవాళ అవన్నీ మరిచిపోయారా అంటూ ఎదురుదాడికి దిగారు రావుల. డాటా కేసులో ఎంత హడావిడి చేస్తే.. అంతలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. సడెన్ గా కేసీఆర్, కేటీఆర్ కు జగన్ పై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+