బీజేపీలో రాజ్యసభ టీడీపీపీ విలీనం: కమలదళంలోకి ఆ నలుగురు: ఊహించని దెబ్బ...!
టీడీపీకి ఊహించని దెబ్బ. తాజా ఎన్నికల్లో ఏపీలో జగన్ టీడీపీని దెబ్బ కొడితే..ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు సమర్ధతకు దెబ్బ. రాజ్యసభలో టీడీపీ నుండి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారిలో మెజార్టీ సభ్యులు నలుగురు పార్టీని రాజ్యసభ టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాజా గా ఎన్నికైన నడ్డాతో కలిసి రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ ఇచ్చారు. ఆ వెంటనే నడ్డా వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో..రాజ్యసభలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎంపీలు నామ మాత్రంగానే ఉండనున్నారు.

టీడీపీకి ఊహించని దెబ్బ..
తెలుగుదేశంకు ఊహించని దెబ్బ తగలింది. ఎన్నికల ఫలితాల వరకు జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన చంద్రబాబు..ఇప్పుడు అదే ఢిల్లీలో ఎదురు దెబ్బ తిన్నారు. రాజ్యసభలో టీడీపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు సభ్యుల్లో నలుగురు తమ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ సంతకాలు చేసిన లేఖను బీజేపీ నేతలతో కలిసి వెళ్లి రాజ్యసభ చైర్మన్‌కు అందచేసారు. దీంతో..ఆరుగురు సభ్యులు ఉన్న పార్టీలో మెజార్టీ సభ్యలు నిర్ణయం..షెడ్యూల్ 10 ప్రకారం రాజ్యంగ బద్దంగా ప్రక్రియను పూర్తి చేసారు. ఈ మేరకు విలీనం లేఖ పైన నలుగురు టీడీపీ ఎంపీలు సంతకాలు చేసారు. ఇక, టీడీపీ నుండి కనకమేడల రవీంద్ర.. సీతారామలక్ష్మి మాత్రమే సభ్యులుగా ఉన్నారు. అయితే, వారిని సైతం టీడీపీ సభ్యులుగా పేర్కొనే అవకాశం లేదు. దీంతో..ఇప్పుడు మోదీ రెండో విడత అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. దీంతో.. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని షాక్‌లు తగులుతాయో చూడాలి.

బీజేపీ కండువాలు..ఆ నలుగురు
టీడీపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి.. సీఎం రమేష్.. టీజీ వెంకటేష్‌కు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తరువాత తాము ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని నడ్డా స్పష్టం చేసారు. గరికపాటి మోహనరావు అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. బీజేపీ నేతలు మాత్రం ఇవి ఫిరాయింపు లు కావు..విలీనం అని చెప్పే ప్రయత్నం చేసారు. సుజనా చౌదరి స్పందిస్తూ దేశం మొత్తం మోదీ నాయకత్వం కోరుకుంటుందని.. ఆయన నాయకత్వంలో పని చేస్తూ ఏపీ ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే తాము బీజేపీలో చేరుతున్నామని ప్రకటించారు. అయితే, టీజీ వెంకటేష్ సైతం స్పందిస్తూ ఏపీ ప్రజలు సైతం బీజేపీతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు బీజేపీతోనే ఉందని వ్యాఖ్యానించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications