అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి పై 11వ తేదీ ఎఫెక్ట్ : ఫ‌లితాల త‌రువాత జోరుగా జంపింగ్‌లు : అంద‌రి చూపు అటువైపే..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. పోలింగ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ప‌లితాల పై ఎవ‌రి అంచ‌నాల్లో వారు ఉన్నారు. అయితే, తెలంగాణ ఫ‌లితాలు ఇప్పుడు ఆ రాష్ట్రంకే ప‌రిమితం కాలేదు. ఆ రాష్ట్ర ఫ‌లితాలు రాజ‌కీయంగా ఏపి కి పెద్ద ఎత్తున ప్ర‌భావం చూప‌నున్నాయి. ఏపిలోనూ రాజ‌కీయంగా ప‌రిస్థితులు వేడెక్కాయి. టిక్కెట్ల ఖ‌రారు చేసుకోవ టంలో ఆశావాహులు బిజీగా ఉన్నారు. తెలంగాణ ఫ‌లితాలు 11న వెల్ల‌డి కానున్నాయి. ఆ ఫ‌లితాల ఆధారంగా చూసిన త‌రువాత‌..ఏపి లో టిడిపి- కాంగ్రెస్ పొత్త‌... పార్టీల బ‌లా బ‌లాల పై స్ప‌ష్ట‌త రానుంది...

కాంగ్రెస్ - టిడిపి పొత్తు పై క్లారిటీ...

కాంగ్రెస్ - టిడిపి పొత్తు పై క్లారిటీ...


ఒక వైపు జాతీయ స్థాయిలో..ఇటు తెలంగాణ లో టిడిపి - కాంగ్రెస్ పొత్తు కొన‌సాగుతోంది. ఇదే స‌మయంలో..టిడిపి కీల‌క‌మై న ఏపిటో అధికారం నిల‌బెట్టుకోవాలంటే ఏం చేయాలో అన్నీ చేస్తోంది. ఏ ఒక్క అవ‌కాశం వ‌దులు కోవ‌టానికి సిద్దంగా లేదు. తెలంగాణ‌లో త‌మ పొత్తు ఎటుంటి ఫ‌లితాన్నిచ్చింద‌నే విష‌యం పై క్లారిటీ వ‌చ్చిన త‌రువాత ఏపిలో ఏ ర‌కంగా ముందుకు వెళ్లాల‌నే దాని పై ఏపి నేత‌లు నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఏపిలో టిడిపి - కాంగ్రెస్ మ‌ధ్య పొత్తు పై రెండు పార్టీలో ఒక సందిగ్ద‌త కొన‌సాగుతోంది. ఏపిలో గ‌తంలో కంటే త‌మ ప‌రిస్థితి మెరుగైంద‌ని భావిస్తున్న కాంగ్రెస్.. టిడిపి తో పొత్తు పెట్టుకుంటే త‌మ సీట్ల‌కు చెక్ పెడ‌తార‌నే అనుమానంలో కొంద‌రు నేత‌లు ఉన్నారు. ఇక‌, ఇదే ర‌క‌మైన సందిగ్డ‌త టిడిపిలోనూ క‌నిపిస్తోంది. ఏపిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్ర‌జ‌లు అంగీక‌రిస్తారా లేదా అనే సంశ‌యం టిడిపి నేత‌ల్లో క‌నిపిస్తోంది. దీంతో..తెలంగాణ లో ప్ర‌జా తీర్పు..ప్ర‌ధానంగా ఏపి సెటిల‌ర్లు ప్ర‌భావం చూపే నియోజక వ‌ర్గాల్లో వ‌చ్చే ఫ‌లితాల ఆధారంగా ఒక అంచ‌నా వ‌స్తుంద‌ని వారు భావ‌విస్తున్నారు. దీంతో.. 11వ తేదీ త‌రువాత మాత్ర‌మే వీట‌న్నింటికీ ఒక క్లారిటీ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

గోడ మీద పిల్లుల్లా జింప్ జిలానీలు..

గోడ మీద పిల్లుల్లా జింప్ జిలానీలు..

అధికార పార్టీ మొద‌లు..ప్ర‌తిప‌క్ష పార్టీ అదే విధంగా బిజెపి నుండి జంపింగ్ ల కోసం జంప్ జిలానీలు ఎదురు చూస్తు న్నారు. టిడిపి లో ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు 35 నుండి 40 మంది వ‌ర‌కు తిరిగి టిక్కెట్లు ద‌క్కే ఛాన్స్ లేద‌ని అధినేత నుండి వ‌స్తున్న సంకేతాలు వారిలో గుబులు పుట్టిస్తున్నాయి. పార్టీలో టిక్కెట్ రాదనే అంచ‌నాతో ఉన్న నేత‌లు ఇప్ప‌టికే ఇత‌ర పార్టీల్లో త‌మ అవ‌కాశాలు..అక్క‌డ గెలుపుకు ఉన్న ప‌రిస్థితుల పై అధ్య‌య‌నం చేస్తున్నారు. ఇక‌, మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ లాంటి వారు 11న ఫ‌లితాల ఆధారంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్నారు. అదే విధంగా బిజెపి ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు..ఆకుల స‌త్య‌నారాణ సైతం పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఇక‌, వైసిపి లో కొంద‌రు నియోజ‌క వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ శ్రేణుల్లో ప్ర‌భావం చూపుతోంది. అక్క‌డ త‌మ‌కు ఇక సీటు రాద‌నే అంచ‌నాకు వ‌చ్చిన నేత‌లు..ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. అయితే ఇక‌, జ‌న‌సేన లో పూర్తి స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్ధులు ఖ‌రారు కాలేదు. దీంతో..టిడిపి - వైసిపి లో స్థానం లేని వారు జ‌న‌సేన వైపు చూసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. జ‌న‌సేన కు ప్ర‌ధానంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో తాకిడి క‌నిపిస్తోంది . ఇదే స‌మ‌యంలో...టిడిపి - కాంగ్రెస్ పొత్తు ఆధారంగా మ‌రి కొంత మంది కీల‌క నేత‌లు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది..

ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాలే కీలకం..

ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాలే కీలకం..


తెలంగాణ ఫ‌లితాలు ఇప్పుడు ఏపి టిడిపి నేత‌ల‌కు టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి. ఏపిలో ప్ర‌భుత్వం పై వ్య‌త‌రేక‌త భారీ స్థాయి లో ఉంద‌నే ప్ర‌చారం ఒక వైపు ఉంది. ఇదే స‌మ‌యంలో కొత్త వ్యూహాల‌తో త‌మ అధినేత ఎలాగైనా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తార‌నే న‌మ్మకం టిడిపి నేత‌ల్లో క‌నిపిస్తోంది. అయితే, తెలంగాణ‌లో ప్ర‌ధానంగా హైద‌రాబాద్ లోని సీమాంధ్ర ఓట‌ర్లు ప్రభావితం చేసే నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాల పైనే అంద‌రూ ఆస‌క్తిగా ఉన్నారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కాంగ్రెస్ - టిడిపి అభ్య‌ర్ధులు పోటీ చేసిన స్థానాల్లో అక్క‌డి సెటిల‌ర్లు ఏ ర‌కంగా తీర్పు ఇచ్చారు.. పొత్తును వారు అంగీక‌రించారా లేదా..రెండు పార్టీల మ‌ధ్య ఓట్ల బ‌దిలీ జ‌రిగిందా లేదా అనేది కీల‌క‌మ‌ని టిడిపి నేత‌లు చెబుతున్నారు . ఒక‌, తెలంగాణ ఫ‌లితాలు వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబు కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి. ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా ఉంటే ఏపిలోనూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. అదే స‌మ‌యంలో..ఫ‌లితాలు ఆశించిన దాని కంటే భిన్నంగా ఉంటే.. ఏపిలో నూ ఇబ్బంది క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని టిడిపి నేత‌లే అంగీక‌రిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఏపి వాసుల దృష్టి అంతా 11వ తేదీ మీదే నెల‌కొంది....

English summary
Telangana poll Results will be effect on Andhra Pradesh Politics. Mainly Alliance between Congress and Tdp in AP depend upon Telangana Results. AP people interestingly watching Greater Hyderabad Assembly segments results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X