అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఎక్కడ అంటే...

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారితో విలవిలలాడుతోన్న ఏపీ ప్రజలను మరోవైపు ఎండలు అల్లడిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోత తీవ్రంగా ఉంది. రుతుపవనాల రాకతో కాస్త వాతావరణం చల్లబడుతుందని భావిస్తుండగా అవి మరికాస్త ఆలస్యంగా ప్రవేశిస్తున్నాయి. రుతుపవనాలు మే 31న కేరళలో ప్రవేశిస్తాయని భావించినా ఆలస్యమైంది.

ఇప్పుడు ఏపీలో మరికాస్త ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజులలో ఏపీలో ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్రత ఈ నెల 8 వరకు కొనసాగే అవకాశం కూడా ఉందని.. రుతుపవనాలు ఆలస్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.

temperature to rise another 3 degrees in AP

రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలలో 34 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు వేడితో కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. తెలంగాణ, ఇతర చోట్ల వాతావరణం కాస్త చల్లబడటంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భానుడి ప్రతాపం కొనసాగినన్నీ రోజులు వైరస్ విలయ తాండవం చేస్తోంది. అలాగే థర్డ్ వేవ్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. పిల్లల గురించి ప్రతీ ఒక్క పేరంట్ గజగజ వణికిపోతున్నారు.

మళ్లీ వచ్చే వేసవిలో కూడా ఫోర్త్ వేవ్ అనే మాట వినిపిస్తోంది. దీనిని బట్టి 5, 6 ఏళ్ల వరకు కరోనా మనలను వీడదని అర్థం అవుతోంది. మాస్క్ ధరించడం మ్యాండెటరీ కానుంది. శానిటైజర్ రాసుకుంటూ.. ఫిజికల్ డిస్టన్స్ మెయింటైన్ చేయడం కంపల్సరీ అవుతుంది.

English summary
temperature to rise another 3 degrees in Andhra Pradesh state weather officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X