కొట్టినట్టు నటిస్తా.. ఏడ్చినట్టు నటించు, నిమ్మగడ్డ, నారా బాబుపై సాయిరెడ్డి నిప్పులు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. మేనిఫెస్టో రద్దుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను కొట్టినట్టు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్టు నటించి అన్నట్టు ఉంది మీ వ్యవహారం అంటూ ఫైరయ్యారు. ఈ మేరకు వరసగా ట్వీట్లు చేశారు. దీంతో నిమ్మగడ్డ, నారా బాబు డ్రామాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు.

మేనిఫెస్టో రద్దు..


ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరుగుతాయి. దానికి సంబంధించి మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. దీనిపై దుమారం చెలరేగింది. వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివరణ అడిగారు. ఎక్స్ ప్లానేషన్ ఏం జరిగిందో తెలియదు కానీ.. టీడీపీ మేనిఫెస్టోను నిమ్మగడ్డ రద్దు చేశారు. దీనిపై విజయసాయి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాధానం సంతృప్తిగా లేకుంటే చర్యలు తీసుకోవాలని సూచించరు. కానీ మేనిఫెస్టో ఎలా రద్దు చేస్తారని అడిగారు.

టీడీపీ కార్యాలయమే..

టీడీపీ కార్యాలయమే..

నిమ్మగడ్డ తన చుట్టూ ఉన్న ఎవరినీ నమ్మడం లేదన్నారు. అందుకే ఆయన మంగళగిరిలో గల టీడీపీ కార్యాలయమే బ్యాక్ ఆఫీసుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు రెండో ట్వీట్ చేశారు. నిమ్మగడ్డ రమేశ్ రూపొందించిన ఈ వాచ్ యాప్ రూపొందించింది ఇక్కడే అని పేర్కొన్నారు. అక్కడే లేఖ, ఆర్డర్ కాపీల డ్రాప్టింగ్ కూడా రూపొందించారని చెప్పారు. అంతేకాదు తన తరఫున వాదించే లాయర్లను కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. నిమ్మగడ్డకు లాయర్లను టీడీపీ ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఆ పార్టీకి ఎంత స్వామి భక్తి అని.. మరీ ఇంతలా బరితెగిస్తారా అని అడిగారు.

హంసా నందిని బికినీ ఫోటోలు హల్‌చల్.. వైరల్‌గా మారిన షోటోషూట్

జడ్పీ ఎన్నికలు..?

జడ్పీ ఎన్నికలు..?

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వర్సెస్ టీడీపీ, ఎస్ఈసీ మధ్య వార్ జరుగుతోంది. ప్రతీ రోజు ఏదో అంశంపై రగడ జరుగుతూనే ఉంది. పంచాయతీలు ఏకగ్రీవంపై కూడా ఎస్ఈసీ కామెంట్ చేయడంతో మాటల యుద్ధం పీక్‌కి చేరింది. ఏకగ్రీవం అయితే మీకు సమస్యే ఏంటీ అని వైసీపీ నేతలు అడుగుతున్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత జడ్పీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని నిమ్మగడ్డ అంటున్నారు. దీనిపై వైసీపీ స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+