వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ వ్యూహం ఏంటి..? రాజ‌కీయ పార్టీల‌కు అంతుచిక్క‌ని గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌ణాళిక‌..

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : రాబోవు ఎన్నిక‌ల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ‌కీయ వ్యూహం ఏంటనేది ఎవరికీ అంతుచిక్క‌డం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్.. కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు కాట‌మ రాయుడు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న జ‌న‌సేన‌..! ప‌వ‌న్ వ్యూహం పై ఆస‌క్తి..!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న జ‌న‌సేన‌..! ప‌వ‌న్ వ్యూహం పై ఆస‌క్తి..!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న జ‌న‌సేన‌..! ప‌వ‌న్ వ్యూహం పై ఆస‌క్తి..!!
ఒకవైపు ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రజాపోరాట యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జనసేనాని.. మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసం ఎప్పటి నుంచో రాష్ట్రంలోని సీనియర్ నేతలను, ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు, ఇతర పార్టీల నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు చ‌ర్చ జరుగుతోంది.

ప్ర‌భావం చూపిస్తామంటున్న గ‌బ్బ‌రం సింగ్..! నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఎదుగుతామంటున్న ప‌వ‌న్..!!

ప్ర‌భావం చూపిస్తామంటున్న గ‌బ్బ‌రం సింగ్..! నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఎదుగుతామంటున్న ప‌వ‌న్..!!

అయితే, చాలా మంది నేతలు మాత్రం జనసేన పార్టీ ని కాదని ఇత‌ర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు జనసేన ప్రభావం కూడా రాష్ట్రంలో అంతగా కనిపించడంలేదనే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో ఆ పార్టీలో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలోని కొందరు సీనియర్లు ఇచ్చిన సలహా మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో కీలక ప్రక్రియ అయిన అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేనాని కొత్త పద్దతికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ ఎవ‌రికి మ‌ద్ద‌త్తు..! స‌ర్వ‌త్రా నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ ఎవ‌రికి మ‌ద్ద‌త్తు..! స‌ర్వ‌త్రా నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

దరఖాస్తుల స్వీకరణ అయితే జరిగింది కానీ, అభ్యర్థుల ఎంపిక కచ్చితంగా ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి నెల‌కొంది. ఇప్పుడిదే సందేహం గ‌బ్బ‌ర్ సింగ్ ఫ్యాన్స్‌లో కలుగుతుందనే చ‌ర్చ జ‌రుగుతోంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలో పలువురు పవన్ వీరాభిమానులు టికెట్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే, ఆ పార్టీలో ఆర్థికంగా బలంగా ఉన్న వారికే టికెట్లు దక్కుతాయనే ప్రచారం మొద‌లైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐతే ప‌వ‌న్ కోట‌రీ మాత్రం ఇలాంటి ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని, పార్టీ బ‌లోపేతానికి క్ర‌షి చేయాల‌ని జ‌న‌సైనికుల‌కు పిలుపునిస్తోంది.

అన్ని పార్టీల‌ను టార్గెట్ చేస్తున్న కాట‌మ‌రాయుడు..! గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్న జ‌న‌సేనాని..!!

అన్ని పార్టీల‌ను టార్గెట్ చేస్తున్న కాట‌మ‌రాయుడు..! గెలుపుపై ధీమా వ్య‌క్తం చేస్తున్న జ‌న‌సేనాని..!!

దీనికితోడు, కొద్దిరోజుల కింద వరకు కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, లోకేష్‌లను టార్గెట్ చేసిన పవన్, ఇటీవల ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ పక్షానే ఉన్నాడన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలకే కాకుండా ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌కు గ‌బ్బ‌ర్ సింగ్ రాజ‌కీయ వ్యూహం ఏంట‌నే సందేహం క‌లుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+