ఏపీలో క‌మ‌లం పోటీ చేస్తుందా..? కార్య‌వ‌ర్గ స‌మావేశంలో బీజేపి తీసుకున్ననిర్ణ‌యం పై ఉత్కంఠ‌..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీమీదే కాకుండా మోడీ విధానాల‌పై ఆగ్ర‌హంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన పార్టీ అంటూ ఆ పార్టీ ఎడ‌మొహం పెడ‌మొహం గా ఉన్నారు ఏపీ జనం. ఈ నేపథ్యంలోనే అమిత్ షా, మోడీ ఏపీకి వచ్చినప్పుడు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ విషయాన్ని గమనించిన బీజేపీ, ఏపీ ఎన్నికల అంశంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని నిర్న‌యం తీసుకోబోతున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుదోంది. అయితే మొద‌టి నుండీ కూడా బీజేపి ప్రభావం ఏపి మీద అంత‌గా లేద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

ఏపిలో బీజేపి వ‌ర్సెస్ టీడిపి..! రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా మారిన పార్టీలు..!!

ఏపిలో బీజేపి వ‌ర్సెస్ టీడిపి..! రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా మారిన పార్టీలు..!!

టీడీపీతో పొత్తు పెట్టుకుని 1999, 2004 ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మాత్రం విజయం సాధించింది బీజేపి. అయితే ప్రస్తుతం టీడీపీ పొత్తు తెగతెంపులు చేసుకోవడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఇక్కడ బీజేపీ వైఖరి కారణంగా ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. మరోవైపు నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో తిరుపతి నుంచి ఇచ్చిన హామీని టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ ప్రజలకు గుర్తు చేస్తూ బీజేపి నిర్వాకాన్ని ప్ర‌జ‌లు మ‌ర్చిపోకుండా చేస్తున్నారు. దీంతో బీజేపి రాష్ట్రానికి చేసిందేమీ లేద‌నే అభిప్రాయంలో ఏపి ప్ర‌జ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

విభ‌జ‌న హామీల అమ‌లు ప‌ట్ల ఏపి ప్ర‌జ‌ల ఆగ్ర‌హం..! బీజేపిని విల‌న్ గా చూస్తున్న జ‌నం..!!

విభ‌జ‌న హామీల అమ‌లు ప‌ట్ల ఏపి ప్ర‌జ‌ల ఆగ్ర‌హం..! బీజేపిని విల‌న్ గా చూస్తున్న జ‌నం..!!

బాబు.. మోదీపై యుద్ధం ప్రకటించడంతో సామాన్య జనంలో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. క్రమంగా రాష్ట్రంలో బీజేపీ బలహీనపడింది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీచేసిన కారుమంచి జయరాం కూడా ఈ కారణంగానే బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవడమే దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్ర‌స్తానం ప్రశ్నార్థకంగా మారింది.

టీడిపితోనే ప్ర‌జాధ‌ర‌ణ‌..! ఒంట‌రి పోటీపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న ఏపి బీజేపి..!!

టీడిపితోనే ప్ర‌జాధ‌ర‌ణ‌..! ఒంట‌రి పోటీపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న ఏపి బీజేపి..!!

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తిరుపతిలో జరగింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరగిన కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌, జాతీయ కార్యదర్శి మురళీధరన్‌ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తిరుపతిలో నిర్వ‌హించిన సమావేశాల ద్వారా జిల్లాలో పార్టీ శ్రేణులకు ఉత్తేజం కలిగించామని నేత‌లు చెప్పుకొస్తున్న‌ప్ప‌టికి లోలోన మాత్రం నేత‌ల‌కు అంత భ‌రోసా క‌ల‌గ‌లేద‌ని, దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశం పై లోతుగా చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపిలో పార్టీ బ‌లోపేతం పై చ‌ర్చ‌..! మ‌రో సారి అమీత్ షాతో సంప్ర‌దింపులు..!!

ఏపిలో పార్టీ బ‌లోపేతం పై చ‌ర్చ‌..! మ‌రో సారి అమీత్ షాతో సంప్ర‌దింపులు..!!

అయితే.. ఈ సమావేశంలో పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదన్న వాతావరణం తేట‌తెల్లం అయ్యింది కాబ‌ట్టి, ఈ సారికి ఏపీలో పోటీ చేయకపోవడమే ఉత్తమం అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సారి ఏపీలో బీజేపీ పోటీ చేస్తే ఉన్న పరువు కూడా పోతుందని, కాబట్టి పోటీ చేయకపోవడమే మంచిదని అంటున్నారు విశ్లేషకులు. మ‌రి బీజేపి అధినాయ‌త్వం దీనిపై స్పందించాల్సి ఉంద‌ని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+