అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చండ్ర నిప్పులు: రాజధానులపై మాట్లాడే హక్కు లేదు, జగన్‌పై ఫైర్

|
Google Oneindia TeluguNews

3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం జగన్ కామెంట్ చేశారు. ఇదీ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీలో మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారని చంద్రబాబు అన్నారు. 3 రాజధానులపై మాట్లాడే నైతిక హక్కు జగన్‎కు లేదన్నారు. మోసాలు, ఘోరాలు చేయడంలో జగన్ దిట్టన్నారు. అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఆయన సూచించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

నమ్మకద్రోహం..

నమ్మకద్రోహం..

ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన జగన్‎కు పాలించే హక్కు లేదని ధ్వజమెత్తారు. సీఎం పదవీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు రావాలని.. మాట్లాడుదామని చంద్రబాబు సవాల్ విసిరిరారు. ప్రజాస్వామ్యం అంటే జగన్‌కు లెక్కలేదని చెప్పారు. కోర్టు తీర్పులను శిరసా వహించాలే తప్ప.. ధిక్కరించకూడదని సూచించారు.

 అప్పుడేం చేశారు..

అప్పుడేం చేశారు..

అమరావతి రాజధానిని ప్రకటించిన సమయంలో జగన్ ఉన్నారని.. ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదని చంద్రబాబు అడిగారు. అమరావతి సెల్ప్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పారు. అక్కడ ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా.. అభివృద్ది చేయొద్దా అని అడిగారు. మరీ తనను ఇల్లు కట్టుకోలేదని మాత్రం అడుగుతారని చెప్పారు. ల్యాండ్ పూలింగ్‌లో రియల్ ఎస్టేట్ ఏంటీ అని అడిగారు.

లేని ససమ్యలు

లేని ససమ్యలు


లేని సమస్యలను జగన్ సృష్టిస్తున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. అందరూ తన వద్దకు కాళ్ల బేరానికి రావాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీపై దాడి చేయడం ఏంటీ అని చంద్రబాబు అడిగారు. పరిటాల రవీంద్ర హత్య కేసు.. నిందితుల సంగతి ఏమైందని అడిగారు. అలా రాష్ట్రంలో పాలన చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మూర్ఖత్వంతో జగన్ ముందుకు వెళుతున్నారని.. తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రజల కోసం.. ప్రజా సమస్యలపై టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు తెలిపారు.

పోరుబాట

పోరుబాట

మద్యపాన నిషేధం కోసం తాము పోరుబాట పట్టామని చెప్పారు. ఇష్ట ప్రకారం రాజధానులపై ముందుకు వెళతామని చెప్పడం సరికాదని అన్నారు. జగన్ మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కౌరవులు కూడా 101 మంది ఉన్నారని అనుకున్నారని.. జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ధర్మం, న్యాయమే గెలుస్తోందని సూచించారు. ప్రజలు అనుకుంటే 1, 5 పోతాయని.. సున్న మిగులుతుందని చెప్పారు.

English summary
you don't have right to speak on capitals chandrababu naidu said to cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X