అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా ఉద్యోగిని కొట్ట‌డానికి చెయ్యెత్తిన అనంత‌పురం జిల్లా అధికారి విశ్వ‌మోహ‌న్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఒక మహిళా ఉద్యోగిని పదే పదే విసిగిస్తోందంటూ ఆమెను కొట్టడానికి అనంతపురం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ సాధికారత అధికారి చెయ్యెత్తారు. ఉద్యోగినిని కొట్టడానికి చెయ్యెత్తిన అధికారి అంటూ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. అనంతపురంలో బీసీ, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖల్లోని వసతిగృహాల సంక్షేమ అధికారులకు (వార్డెన్స్) బదిలీ కౌన్సెలింగ్ జరుగుతోంది.

ఓ మహిళా వార్డెన్ ను తాడిపత్రి నుంచి కదిరికి బదిలీ చేయడంతో ఆమె తనకు కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ కాకుండా ప్రీమెట్రిక్ హాస్టల్ ఇవ్వాలంటూ పలుసార్లు విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్పటికే మీకు పోస్టింగ్ ఇచ్చామని, కానీ పదే పదే విసిగిస్తున్నారంటూ అనంతపురం జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి విశ్వమోహన్ రెడ్డి ''పోతావా? లేదా? ఏందమ్మా నీది'' అంటూ ఆమెపై చెయ్యి ఎత్తారు. బదిలీల ప్రక్రియ జరుగుతున్న మందిరంలోనే అందరూ చూస్తుండగానే ''ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో.. '' అంటూ ఆమెను తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. ఆ మహిళా వార్డెన్ భర్తను కూడా ''బుద్దిలేనోడా.. బయటకు పో'' అంటూ గట్టిగా గద్దించారు.

Anantapur District Officer Vishwa Mohan Reddy who tried to beat up a female employee

వీడియో వైరల్ కావడంతో ఈ విషయమై విశ్వమోహన్ రెడ్డిని విలేకరులు వివరణ కోరారు. కౌన్సెలింగ్ జరగడానికి ముందే ఆమె తనను ఫోన్ చేసి విసిగించారని, తన ఇంటికి కూడా భర్తతో కలిసి రెండుసార్లు వచ్చారని, కౌన్సెలింగ్ సమయంలో కదిరి హాస్టల్ కోరుకుంటే కేటాయించామన్నారు.

Anantapur District Officer Vishwa Mohan Reddy who tried to beat up a female employee

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia

వేరేవారికి ప్రీ మెట్రిక్ హాస్టల్ కేటాయించామన్నారు. తర్వాత తనకు కూడా అదే కావాలంటూ వచ్చారని, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విసుగు పుట్టించారని, అందుకే సహనం కోల్పోయి గట్టిగా మందలించినట్లు విశ్వమోహన్ రెడ్డి వెల్లడించారు.

English summary
Anantapur District Officer Vishwa Mohan Reddy who tried to beat up a female employee
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X