ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాప్తాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాప్తాడు మండలం, సికె పల్లి, రామగిరి, బనగానపల్లె మండలాలు వచ్చి చేరాయి. అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. రాప్తాడు నియోజకవర్గం 2009 లో ఏర్పాటైనప్పటి నుండి పరిటాల సునీత గెలుస్తూ వస్తున్నారు. పరిటాల రవి హత్య తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి న సునీ..2009, 2014 లో రాప్తాడు నుండి గెలుపొందారు. సునీత భర్త పరిటాల రవి పెనుగొండ నుండి నాలుగు సార్లు ఎమ్మె ల్యేగా గెలిచి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసారు. 2005 లో రవి హత్యకు గురయ్యారు. ఆ తరువాత పెనుగొండ లో జరిగిన ఉప ఎన్నికలో సునీత గెలుపొందారు.
రెండు సార్లు ఎన్నికలు..
2009 లో ఏర్పడిన ఈ నియోకవర్గంలో టిడిపి నుండి పోటీ చేసిన పరిటాల సునీత కాంగ్రెస్ అభ్యర్ది తోపుదుర్తి ప్రకాష్ రెడ్ఇ పై 1707 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన సునీతకు 64559 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్య ర్దిగా పోటీ చేసిన ప్రకాశ్ రెడ్డికి 62,852 ఓట్లు వచ్చాయి. ఇక, ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన కె కృష్ణమూర్తికి కేవలం 6429 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఆ ఎన్నికల తరువాత జరిగిన రాజకీయా పరిణామాలో ప్రకాశ్ రెడ్డి వైసిపి లో కొనసాగుతున్నారు.

2014 లో తిరిగి సునీత గెలుపు..
2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు లో మొత్తంగా 212954 ఓట్లు ఉండగా, అందులో179941 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసి న పరిటాల సునీత కు 91394 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన టి ప్రకాశ్ రెడ్డికి 83626ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్దిగా పోటీ చేసిన సునీత 7774 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సునీత మంత్రిగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications