ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2209 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా.. ప్ర‌స్తుతం ఉన్న మండ‌లాల‌తో పాటుగా క‌నెక‌ల్లు మండ‌లం ఈ నియోజ‌క వ‌ర్గంలో చేరింది. ఇక్క‌డ నుండి కాంగ్రెస్ నేత పాటిల్ వేణుగోపాల్ రెడ్డి మూడు సార్లు గెలుపొందారు. తిప్పేస్వామి, బండి హులికుంట‌ప్ప లు రెండు సార్లు గెలిచారు. ఒక‌సారి ఉప ఎన్నిక‌లో గెలిచిన ప‌య్యావుల వెంక‌ట నారాయ‌ణ , ఉవ‌ర‌కొండ నుండి మూడు సార్లు గెలిచిన కేశ‌వ్ లు తండ్రి..కుమారులు. 2009 వ‌ర‌కు ఒక ర‌కంగా సాగిన రాజ‌కీయాలు.. వైయ‌స్ మ‌ర ణం తో మారిపోయాయ‌. జ‌గ‌న్ పార్టీ ఏర్పాటు తో స‌మీక‌ర‌ణాల్లో మార్పు వ‌చ్చింది. 2009 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామ‌చంద్రారెడ్డి వైసిపి లో చేరారు.

15 సార్లు ఎన్నిక‌లు..
రాయ‌దుర్గం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి 1952 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ప‌ది సార్లు గెలిస్తే.. టిడిపి మూడు సార్లు గెలిచింది. స్వతంత్ర పార్టీ ఒక‌సారి..ఇండిపెండెంట్ అభ్య‌ర్ది ఒక‌సారి గెలిచారు. 2009 ఎన్నిక‌ల్లో క‌ర్న‌ట‌క బిజెపి మంత్రిగా ప‌ని చేసిన గాలి జ‌నార్ధ‌న‌రెడ్డి సోద‌రుల‌కు చెందిన సంస్థ‌లో ఎండిగా ప‌ని చేస్తున్న కాపు రామ‌చంద్రారెడ్డి కాంగ్రెస్ నుండి ఎన్నిక‌య్యారు. 2009 లో వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత ఆయ‌న త‌న‌యు డు జ‌గ‌న్ వైసిపి ని ఏర్పాటు చేసారు. రామ‌చంద్రారెడ్డి కాంగ్రెస్ ప్ర‌భుత్వం పై పెట్టిన అవిశ్వాసానికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రిం చి అన‌ర్హ‌త వేటుకు గుర‌య్యారు.

 #AndhraPradeshElections2019: All about Rayadurg Constituency

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నిక‌ల్లో రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 225860 ఓట్లు ఉండ‌గా, అందులో 191462 ఓట్లు పోల‌య్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన కాల్వ శ్రీనివాసులు 92844 ఓట్లు ద‌క్కించుకోగా, వైసిపి నుండి పోటీ చేసిన కాపు రామ‌చంద్రా రెడ్డి కి 90517 ఓట్లు వ‌చ్చా యి. టిడిపి అభ్య‌ర్ది కాల్వ శ్రీనివాసులు 1827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాల్వ శ్రీనివాసు లు జ‌ర్న‌లిస్టుగా ఉంటూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. లోక్‌స‌భ స‌భ్యుడిగా ప‌ని చేసారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత టిడిపి ప్ర‌భుత్వం లో చీఫ్ విప్‌గా ప‌ని చేసారు. 2017 లో జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లో భాగంగా జిల్లా నుండి ప్రాతిని ధ్యం వ‌హిస్తున్న ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డిని తొలిగించి ఆయ‌న స్థానంలో కాల్వ శ్రీనివాస‌లుకు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ప‌ల్లె ర‌ఘునాద‌రెడ్డికి చీఫ్ విప్ ప‌ద‌వి ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+