ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    AP Assembly Election 2019 : Uravakonda Assembly Constituency,Sitting MLA,MLA Performance Report

    2009 నియోక‌వ‌ర్గాల పున‌ర్విభ‌నలో భాగంగా బెళుగుప్ప‌, కూడేరు మండ‌లం కొత్త‌గా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం లో క‌లిసా యి. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో పయ్య‌వుల కేశ‌వ్ మూడు సార్లు గెలిచారు. జిసి వెంక‌న్న రెండు సార్లు గెలుపొందారు. వెంక‌న్న కాసు క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు.ఇక్క‌డ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రాయ‌ల వేమ‌న్న గ‌తంలో కోట్ల మంత్రివ‌ర్గంలో..గుర్రం నారాయ‌ణ‌ప్ప ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. రాయ‌దుర్గం లో ఒక‌సారి గెలిచిన ప‌య్య‌వుల మూడుసార్లు ఉర‌వ‌కొండ‌లో గెలిచిన కేశవ్ లు తండ్రి..కుమారులు. ఇక్క‌డ భీమ్‌రెడ్డి గెలిస్తే, ఆయ‌న కుమారు లు శివ‌రామిరెడ్డి ఉర‌వ‌కొండ‌లోనూ..మ‌రో కుమారుడు సాయి ప్ర‌సాద‌రెడ్డి ఆదోనిలోనూ గెలుపొందారు. శివ‌రామిరెడ్డి ఎమ్మె ల్సీగానూ వ్య‌వ‌హ‌రించారు. మ‌రో కుమారుడు బాల‌నాగిరెడ్డి ప్ర‌స్తుతం మంత్రాల‌యం ఎమ్మెల్యేగా ఉన్నారు.

    12 సార్లు ఎన్నిక‌లు..
    ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌ర‌కు 12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ నాలుగు సార్లు, టిడిపి అయిదు సార్లు, స్వంత్రులు రెండు సార్లు నెగ్గారు. జిసి వెంక‌న్న రెండు సార్లు గెలిచారు. ఒక సారి వైసిపి గెలిచాయి. తొలుత సీపియం లో ఉన్న విశ్వేశ్వ‌ర రెడ్డి 2004 ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి ఆ పార్టీ అభ్య‌ర్దిగా పోటీ చేసి పెయ్యావుల కేశ‌వ్ చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ లో చేరి తిరిగి పోటీ చేసిన విశ్వేశ్వ‌ర‌రెడ్డి మ‌రోసారి కేశ‌వ్ చేతితో ఓడిపోయారు. ఆ త‌రువాత ఆయ న పార్టీ మార‌టంతో ఇక్క‌డ స‌మీక‌ర‌ణాలు మారాయి.

    #AndhraPradeshElections2019: All about Uravakonda Constituency

    2014 లో వైసిపి గెలుపు..
    2014 ఎన్నిక‌ల్లో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం లో మొత్తం 193499 ఓట్లు ఉండ‌గా, అందులో 165471 ఓట్లు పోల‌య్యాయి. వైసి పి నుండి పోటీ చేసిన విశ్వేశ్వ‌ర రెడ్డికి 81042 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన ప‌య్యావుల కేశ‌వ్ కు 78767 ఓట్లు వ చ్చాయి. వైసిపి అభ్య ర్ధి విశ్వేశ్వ‌ర రెడ్డి 2275 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు అభ్య‌ర్దులే పోటీ ప‌డ గా.. టిడిపి అభ్య‌ర్ది కేశ‌వ్ 229 ఓట్ల ఆధిక్య‌తంతో గెలిచారు. 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కేశ‌వ్ కు ఎమ్మెల్సీగా అవ‌కా శం ద‌క్కింది. ఆయ‌న ప్ర‌స్తుతం శాస‌న‌మండ‌లి లో విప్ గా ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+