అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు: సకాలంలో: పేషెంట్లు సేఫ్
అనంతపురం: విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదానికి సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గక ముందే.. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించంది. రికార్డు రూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదు. ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్ సోకిన పేషెంట్లను వేరే వార్డుకు తరలించారు. జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం సకాలంలో స్పందించి, మంటలను అదుపు చేయగలిగారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో రికార్డులను భద్రపరిచే గదిలో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు అలముకున్న వెంటనే మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ గది ఆనుకుని కోవిడ్ వార్డు ఉండటం, అందులో 18 మంది పేషెంట్లు చికిత్స పొందుతుండటం ఆందోళనకు దారి తీసింది. మంటలు చెలరేగిన వెంటనే నైట్ డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రికార్డు రూమ్ మంటల్లో కాలిపోయింది. అగ్నికీలలు బయటి దాకా వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక సిబ్బంది నిరోధించగలిగారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు వ్యాపించకుండా అరికట్టామని వారు చెప్పారు. కొద్దిరోజుల కిందటే విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మరణించారు. రమేష్ ఆసుప్రతుల యజమాని డాక్టర్ రమేష్ పోతినేని ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications