అనంతపురం జిల్లాలో రక్తమోడిన రోడ్లు .. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
అనంతపురం జిల్లాలో పండుగనాడు పెను విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం రోడ్లు రక్తమోడాయి. అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మరణించడంతో విషాదం చోటుచేసుకుంది .

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
పామిడి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను తహసిల్దార్ కార్యాలయం సమీపంలో వేగంగా వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. పెద్దవడుగూరు క్రాస్ కు వెళ్లడం కోసం ఆటో రాంగ్ రూట్ లో రావడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఐదుగురు మహిళల దుర్మరణం .. ఎనిమిది మందికి గాయాలు
ఈ ఘటనలో మరణించినవారు ఐదుగురు మహిళలే. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరంతా పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లిలో పత్తి ఏరడానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు
ఈ ఘటనలో మృతి చెందిన వారు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన వారిగా గుర్తించారు. మృతులను శంకరమ్మ, చౌడమ్మ, సావిత్రి, సుబ్బమ్మ, నాగవేణిలుగా గుర్తించారు.

పాదచారులపైకి దూసుకెళ్లిన కారు .. ఇద్దరు మృతి
వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డుపై పడిన భీతావహ ఘటన అందరినీ ఆవేదనకు గురి చేసింది.ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలోనే మరో రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకుంది. పెద్దవడుగూరు మండలం మిడత వండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఒక కారు పాదచారులపై దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను పామిడి మండలం ఎదురూరు వాసులైన యాకూబ్, నారాయణ లుగా గుర్తించారు. ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video

మితిమీరిన వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం రోడ్డు ప్రమాదాలకు కారణం
రోడ్డు భద్రత పైన ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన కూడా, రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో ఆటో రాంగ్ రూట్ లో రావడమే కాకుండా, ఆటోను గుద్దిన గుర్తుతెలియని వాహనం మితిమీరిన వేగంతో రావడం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇక పాదచారులపైకి కారు దూసుకు వెళ్ళిన ఘటనలో కూడా మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications