అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుకు రూ.2 వేలు ఇచ్చా: పనులెందుకు చేయాలి: ఓటర్లకు జేసీ రివర్స్ పంచ్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఓటర్లకు రివర్స్ పంచ్‌తో చెలరేగిపోయారు. తమ వీధిలో రోడ్లు బాగాలేవంటూ నిలదీసిన స్థానికులపై ఆయన ఒక్కసారిగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. తనదైన శైలి పదజాలాన్ని వారిపై ప్రయోగించారు. ఎన్నికల్లోల గెలవడానికి వేలకు వేలు డబ్బులు పోశామని, ఇఫ్పుడు పనులు చెయ్యలేమని తేల్చి పారేశారు. ఎప్పుడైతే ఓటర్లు డబ్బులు తీసుకోకుకండా ఓటువేస్తారో.. అప్పుడు కాలర్ పట్టుకుని అడిగే హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేశారు.

తండ్రిలాగే..సమర్థుడు: వైఎస్ జగన్‌ను ఆకాశానికెత్తేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి: త్వరలో కలుస్తాతండ్రిలాగే..సమర్థుడు: వైఎస్ జగన్‌ను ఆకాశానికెత్తేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి: త్వరలో కలుస్తా

స్థానిక సమస్యల గురించి ప్రస్తావించగా..

స్థానిక సమస్యల గురించి ప్రస్తావించగా..

తాడిపత్రిలోని 35వ వార్డులో జేసీ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన ప్రజలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు సరిగ్గా లేవని, మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని చెప్పారు. కొత్త రోడ్లను వేయాలని విజ్ఞప్తి చేశారు. మురుగునీటి దుర్వాసనను భరించలేకపోతున్నామని, డ్రైనేజీ వ్యవస్థను సరి చేయాలని కోరారు. ఎండాకాలంలో సమీపించడంతో మంచినీరు దొరకట్లేదని వాపోయారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. దోమల మందు చలించాలని స్థానిక మహిళలు జేసీ ప్రభాకర్ రెడ్డిని కోరారు.

ఓటుకు రెండు వేలు..

ఓటుకు రెండు వేలు..


దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి భిన్నంగా స్పందించారు. రివర్స్ పంచ్‌లు ఇచ్చారు. పనులు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి లక్షల రూపాయలను ఖర్చు చేశామని, ఇప్పుడు పనులు చేయమంటే.. చేయలేమని స్పష్టం చేశారు. ఒక్కో ఓటుకు రెండు వేల రూపాయలను తాను ఖర్చు చేశానని గుర్తు చేశారు. ఓటుకు రెండు వేల రూపాయలు తీసుకుని ఇప్పుడు పనులు చేయమని అడుగుతారా? అంటూ ఓటర్లను ఆయనే నిలదీశారు. పనులు చేయమని నన్ను అడిగే హక్కు లేదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే, తాను పనులు చేసేవాడినని అన్నారు.

అప్పుడు కాలర్ పట్టుకుని అడగొచ్చు..

అప్పుడు కాలర్ పట్టుకుని అడగొచ్చు..

డబ్బులు తీసుకోకుండా తనకు ఓటు వేసి ఉంటే.. అప్పుడు కాలర్ పట్టుకుని ప్రశ్నించే హక్కు ఓటర్లకు ఉండేదని అన్నారు. తనకు రోడ్ల గురించి, మంచినీళ్ల గురించి అడగొద్దని ముఖం మీదే చెప్పేశారు. ఏ రోజైతే డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారో.. అప్పుడు కాలర్ పట్టుకుని అడిగే హక్కు ఓటర్లకు ఉంటుందని స్పష్టం చేశారు. డబ్బులు తీసుకుని ఓటు వేస్తారు కాబట్టే.. తాము పనులు చేయకపోయినా ధైర్యంగా తిరగగలుగుతున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి తేటతెల్లం చేశారు. ప్రజల్లో ఏ మాత్రం మార్పు రాబోదని, డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయలేరనీ ఆయన చెప్పుకొచ్చారు.

ఆ ఒక్క చోటే టీడీపీ..

ఆ ఒక్క చోటే టీడీపీ..

కిందటి నెల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న విలషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఒక్క చోటే టీడీపీ జెండా ఎగురవేయగలిగింది. 75 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించగా.. 74 చోట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. హంగ్ ఏర్పడటంతో ఎక్స్ అఫీషియో ఓట్ల ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఈ మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకోగలిగింది. తాడిపత్రి పట్టణంపై జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు పట్టు కారణంగానే టీడీపీ గెలిచిందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.

English summary
Newly elected Tadipatri Municipal Chairman in Anantapur district, JC Prabhakar Reddy Shocks Voter with his answer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X